ఇప్పటికే వరస ఎదురు దెబ్బలు తింటున్న బీఆర్ఎస్ పార్టీకి( BRS Party ) మరో ఎదురు దెబ్బ తగిలింది .తాజాగా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని తెలంగాణ హైకోర్టు( Telangana High Court ) అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.15 రోజుల్లో బీ ఆర్ ఎస్ పార్టీ భవనాన్ని ఖాళీ చేయించి కూల్చివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. బిఆర్ఎస్ పార్టీకి లక్ష రూపాయల జరిమానా ను కూడా విధించింది .భవనం నిర్మించాక అనుమతి ఎలా తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ పార్టీ భవనాన్ని కూల్చివేయకుండా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
వివరాల్లోకి వెళితే నల్గొండ పట్టణంలోని( Nalgonda ) హైదరాబాద్ రోడ్డు పక్కన భారీ విలువ పలికే ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కు చెందిన భూమిలోని ఎకరా స్థలాన్ని అప్పటి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఏడాదికి కేవలం 100కే లీజుకు తీసుకుంది.ఆ తరువాత అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని( BRS Party Office ) నిర్మించింది.అయితే ఆ భవనానికి మున్సిపల్ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేవని , గతం నుంచి నేటి వరకు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తూనే వచ్చారు.
తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో నల్గొండలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Minister Komatireddy Venkatreddy ) ప్రత్యేకంగా దృష్టి సారించారు. స్థానిక కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ భవనాన్ని కూల్చేయాలని అధికారులకు గతంలోనే ఆదేశాలు ఇచ్చారు.ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఆఫీసును కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్ కు, మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
స్థానిక కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య ఈ వ్యవహారంలో విమర్శలు ప్రతి విమర్శలు జరిగాయి మంత్రి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది.తాజాగా హైకోర్టు కూడా పై విధంగా స్పందించింది.