లాక్‌డౌన్‌ సమయంలో సీజ్‌ చేసిన రెండు లక్షల వాహనాలపై టీ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ ఎత్తున ఫైన్స్‌ విధించడంతో పాటు దాదాపుగా రెండు లక్షలకు పైగా వాహనాలను సీజ్‌ చేసినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు తెలియజేశారు.పెద్ద ఎత్తున సీజ్‌ చేసిన వాహనాలను భద్రపర్చడం ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఎవరి వాహనాలను వారికి అందజేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలంగాణ పోలీసు శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు.

 Telangana  Government's Key Decision On Two Lakh Vehicles Seized During Lockdown-TeluguStop.com

వాహనాలు తిరిగి ఇచ్చినంత మాత్రాన వారిపై కేసు ఉండదు అని కాదని, వారితో బాండ్‌ రాయించుకుని, వారిపై కొనసాగిస్తూనే వారి వాహనాలను వారికి ఇవ్వబోతున్నాం.పోలీసు వారితో దుర్భాషలాడిన వారిని, పోలీసులపై దాడికి ప్రయత్నించిన వారిని, కొందరు అవాంచనీయంగా ప్రవర్తించిన వారిని మాత్రం వదిలి పెట్టబోయేది లేదని ఈ సందర్బంగా పోలీసులు పేర్కొన్నారు.

వారి వాహనాలు అలాగే మా వద్ద కొనసాగుతాయి.లాక్‌డౌన్‌ ఉల్లంఘించి బయటకు వచ్చిన వారి వాహనాలు మాత్రమే తిరిగి ఇవ్వబడును.వారికి కూడా కేసు ఉంటుందని, వారితో బాండ్‌ రాసుకున్న తర్వాతే ఎవరి వాహనం వారికి హ్యాండోవర్‌ చేయబడును అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube