ఏపీ ఎన్నికలపై తెలంగాణా ప్రభావం ఎంత..?

రాష్ట్రంలో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా తెలంగాణా ఎన్నికల ప్రభావం ఏపీ పై ఎలా ఉంటుంది అనే చర్చ మాత్రం రాకుండా ఉండటం లేదు.తెలంగాలో ఏమి జరిగిందో ఎవరు గెలిచారో పక్కన పెడితే ప్రజలు తమకి కావాల్సిన నాయకుడిని ఎన్నుకున్నారు అనేది మాత్రం స్పష్టంగా అర్థం అవుతోంది.

 Telangana Election Results Effects Ap Elections Too1-TeluguStop.com

నాలుగు పార్టీలు కలిసి ఏకం అయ్యి కేసీఆర్ పై దండయాత్ర చేసినా సరే ప్రజలు మాత్రం కేసీఆర్ వైపే ఉండటం గమనార్హం.అయితే

ఏపీలో ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపధ్యంలో ఇప్పుడు సర్వత్ర ఆసక్తి నెలకొంది.అంతేకాదు తెలంగాణా ప్రభావం ఏపీ పై ఎంత అంటూ లెక్కలు వినిపిస్తున్నాయి.అక్కడ అధికార పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఏపీలో కూడా అధికార పార్టీ వస్తుందా అనే చర్చలు మొదలయ్యాయి.

అయితే అక్కడి ప్రజలకి కేసీఆర్ కి మధ్య ఉన్న సంభంధాలు వేరు ఇక్కడ చంద్రబాబు కి ప్రజలకిమధ్య ఉన్న సంభంధాలు వేరు ఎందుకంటే.

చంద్రబాబు నాయుడికి ,కేసీఆర్ కి ప్రజలలో ఉన్న ఆదరణ పోల్చుకుంటే చాలా వ్యత్యాసం ఉంది.

గతంలో బాబు పై ఉన్న నమ్మకం ఇప్పుడు ఏపీ ప్రజలలో కొరవడింది అని చెప్పవచ్చు.ఏపీ ప్రయోజనాల కోసం బీజేపీ తో కలిసి పయనించాను అని చెప్పిన బాబు ఏపీ కి కేంద్రం నుంచీ చేయించుకోవాల్సిన పనుల విషయంలో కూడా తీవ్ర అలసత్వంగా వ్యవహరించారు.

ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో బాబు తీరు ప్రజలని టీడీపీ ప్రభుత్వానికి దూరం చేశాయి.

మరీ ముఖ్యంగా కేంద్రంపై పోరు చేసే క్రమంలో విపరీతంగా ప్రజా ధనం వృధా అవ్వడం కూడా బాబు పై ఏపీ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తీసుకువచ్చింది.వారసత్వ రాజకీయాలను వద్దన్న చంద్రబాబు, తన పుత్రరత్నానికి పదవులని కట్టబెట్టడం కూడా ప్రజలని ఆలోచింప చేసింది.బాబు చెప్పే మాటలకి క్షేత్ర స్థాయిలో జరుగుతున్నా పనులకి అస్సలు సంభంధం లేకపోవడంతో బాబు పై ఏపీ ప్రజలకి మెల్ల మెల్లగా విశ్వాసాన్ని కోల్పోయేలా చేసింది.

దాంతో ప్రస్తుతం ఏపీ పజలు బాబుకి మరో సారి అధికారం కట్టబెట్టాలా లేదా అనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.ఏది ఏమైనా సరే తెలంగాణా ప్రజలు అక్కడి అధికార పార్టీకి మళ్ళీ పట్టం కడితే.

ఏపీ ప్రజలు మాత్రం బాబు ని ఇంటికి సాగనంపనున్నారు అని అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube