పూర్తిస్థాయిలో మంత్రి వర్గాన్ని విస్తరించి, పూర్తిగా పాలనపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.( CM Revanth Reddy ) తెలంగాణ ముఖ్యమంత్రిగా తాను ప్రమాణస్వీకారం చేసిన తర్వాత 11 మందిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు.
వారికి వివిధ శాఖలను కేటాయించారు.ఇంకా ఆరు మంత్రి పదవులను భర్తీ చేయాల్సి ఉంది.
ఇప్పుడు వీటిపైనే రేవంత్ దృష్టి సారించారు .తెలంగాణ మంత్రి వర్గంలో( Telangana Cabinet ) 17 మందికి అవకాశం ఉండడంతో, మిగిలిన మంత్రి పదవులను ఎవరెవరికి కేటాయించాలనే విషయంపై రేవంత్ ఫోకస్ పెట్టారు.
తొలి విడత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో సీనియర్ నాయకులతో పాటు, కొత్తగా వచ్చిన వారికి మంత్రి పదవులు దక్కాయి. ఇంకా మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న సీనియర్ నేతలు, రేవంత్ కు అత్యంత సన్నిహితులైన వారు చాలామంది తమకు మంత్రి పదవి ఖాయమనే నమ్మకంతో ఉన్నారు.
కొంతమంది ఎమ్మెల్యే సీట్లను సైతం త్యాగం చేసి పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వారు ఎమ్మెల్సీలుగా తమకు అవకాశం ఇచ్చి మంత్రులను చేస్తారని రేవంత్ పై నమ్మకం పెట్టుకున్నారు.అలాగే కొన్ని ప్రాంతాలకు క్యాబినెట్ లో ప్రాతినిధ్యం లేకపోవడంతో, వారు కూడా తమకు అవకాశం వస్తుందని అంచనా వేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్( Congress Party ) తరపున పోటీ చేసిన వారంతా ఓటమి చెందడం తో ఆ ప్రాంతంలో ఎవరికి మంత్రి పదవులు దక్కలేదు.ఓడిన వారికి ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించలేని పరిస్థితి ఉంది.దీంతో మిగతా ప్రాంతాలపై రేవంత్ దృష్టి పెట్టారు. ముఖ్యంగా తనకు అత్యంత సన్నిహితుడైన అద్దంకి దయాకర్ ను( Addanki Dayakar ) మంత్రివర్గంలోకి తీసుకోవాలని రేవంత్ భావిస్తున్నారట .అద్దంకి దయాకర్ కు సీటు దక్కకపోయినా, పార్టీ కోసం పనిచేశారు.అతనికి మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నారట.
అలాగే హైదరాబాద్ నుంచి ఎన్.ఎస్.యు.ఐ తరఫున ఒకరికి అవకాశం ఇవ్వాలని ఉస్మానియా యూనివర్సిటీకి ప్రాతినిధ్యం ఇవ్వాలనే ఆలోచనలు రేవంత్ ఉన్నారట.
అదే జరిగితే విద్యార్థి సంఘం నేత పేరు ఒకటి ప్రముఖంగా వినిపిస్తోంది .ఇదే విధంగా గడ్డం బ్రదర్స్ లో( Gaddam Brothers ) ఒకరికి అవకాశం ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. వారు ఆర్థికంగా సామాజికంగా బలంగా ఉండడంతో త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో గడ్డం బ్రదర్స్ లో ఒకరికి అవకాశం దక్కబోతోందట.ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ పై అధిష్టానం తో కూడా చర్చించి కొన్ని పేర్లను కూడా రేవంత్ ప్రతిపాదించారట.
దీనిపై అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని విస్తరిస్తారట.