భారతదేశపు ప్రధాన ఆహార పంట వరి పంట( Rice crop ).భారతదేశంలో నీటి వనరులు సంపూర్ణంగా ఉండే ప్రాంతాల్లో వరి అధిక విస్తీర్ణంలో సాగు అవుతుందని తెలిసిందే.
వరి పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే సాగు ప్రారంభించక ముందే సాగు విధానంపై రైతులకు కచ్చితంగా అవగాహన ఉండాలి.అప్పుడే ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందవచ్చని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.
ఈమధ్య వరి పంటకు కలుపు ప్రధాన సమస్యగా మారింది.చాలామంది రైతులు కలుపును పూర్తిస్థాయిలో నివారించడంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ.కేవలం కలుపు సమస్య( Weed problem ) కారణంగా ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందలేకపోతున్నారు.వరి పొలాల్లో కలుపును ఎలా నివారించాలో పూర్తిగా తెలుసుకుందాం.ప్రధాన పొలంలో వరి నాట్లు వేసిన ఒక వారం రోజులకు అనిలోఫాస్, ప్రటిలాక్టేర్, బుటాక్లోర్ లలో ఏదో ఒక రసాయనాన్ని పొడి ఇసుకలో కలిపి పొలంలో చల్లుకోవాలి.ఒక నెల రోజుల తర్వాత ఒక ఎకరం పొలానికి సోడియం సాల్ట్ 2,4డి 400గ్రా ను పంటపై పిచికారి చేయాలి.
లేదంటే ప్రిటిలాక్లోర్ సెఫనర్ ను ఒక ఎకరాకు 600 మిల్లీలీటర్లను వరి నాట్లు వేసిన ఐదు రోజులలోపు వాడుకోవాలి.బిన్ పైరిబాక్ సోడియం అనే కలుపు మందును 0.5ml ఒక లీటరు నీటిలో కలిపి నాట్లు వేసిన పది రోజులకు పిచికారి చేయాలి.అయితే కలుపులో రకాలను బట్టి పిచికారి మందు ఎంపిక చేసుకుని పిచికారి చేయాల్సి ఉంటుంది.
కలుపు సమస్య తక్కువగా ఉండే పొలాల్లో కూలీల ద్వారా కలుపు ను తొలగించాలి.కలుపు సమస్య ఎక్కువగా ఉంటేనే రసాయన పిచికారి ( Chemical sprayer )మందులను ఉపయోగించాలి.
మార్కెట్లో చాలా రకాల నకిలీ రసాయన మందులు అందుబాటులో ఉన్నాయి.కాబట్టి వ్యవసాయ క్షేత్ర నిపుణుల( Agricultural experts ) సలహాలు తీసుకొని రసాయన మందులను ఉపయోగించడం మంచిది.