వరల్డ్ కప్ ముందు బయటపడ్డ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వీక్నెస్...

ఇండియా ప్రస్తుత కెప్టెన్ అయిన రోహిత్ శర్మ వరల్డ్ కప్ కి ముందు మంచి ఫామ్ లో ఉండాలని క్రికెట్ అభిమానులు అందరూ అనుకుంటున్నారు.ఎందుకంటే అక్టోబరు 16న ఆస్ట్రేలియా లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు రోహిత్‌ నాయకత్వం వహించి టి20 వరల్డ్ కప్ ను గెలుచుకోవాలని క్రికెట్ అభిమానులు ఇప్పటినుంచే పూజలు కూడా మొదలుపెట్టారు.2007లో ఎంఎస్‌ ధోనీ సారథ్యంలో భారత్‌ తొలిసారిగా టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే.టీమిండియా టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేయడంతో పాటు అత్యధికంగా 4 సెంచరీలు సాధించిన ఆటగాడిగా ఉన్నాడు.

 Team India Captain Rohit Sharma Weakness Befor T20 World Cup Details, Team India-TeluguStop.com

అయితే ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో మాత్రం చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు.అతను 3 మ్యాచ్‌ల్లో రెండు సార్లు డక్ అవుట్ అవ్వడం వల్ల క్రికెట్ విశ్లేషణతో పాటు, అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు.

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో రెండవసారి బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో రోహిత్ డక్ అవుట్ ఔటయ్యాడు.లక్ష్యాన్ని ఛేదించే సమయంలో అతని రికార్డు అంత ఏమీ బాగాలేదు.

మరోవైపు కింగ్ కోహ్లి అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ప్రత్యర్థి జట్ల పైన విరుచుకుపడుతున్నాడు.

చేజింగ్ లో రోహిత్ శర్మ టి20 లలో 63 ఇన్నింగ్స్ లలో 27 సగటుతో 1461 పరుగులు చేశాడు.

Telugu Cricket, Rohit Sharma, Rohitsharma, Africa, Cup, India, Virat Kohli-Sport

ఈ ఇన్నింగ్స్ లలో ఒక సెంచరీ, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి.స్ట్రైక్ రేట్ 133 గా ఉంది.అంటే దాదాపు ఐదు ఇన్నింగ్ లో ఒక్కసారి 50 కంటే ఎక్కువ పరుగులు చేస్తున్నాడు.T20 ప్రపంచకప్ సమయంలో ప్రత్యర్థి జట్లు దీనిని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాయి.అదే సమయంలో విరాట్ కోహ్లీ లక్ష్యాన్ని చేదించే క్రమంలో అతనికి మంచి రికార్డు ఉంది.44 ఇన్నింగ్స్లలో 70 సగటుతో 1901 పరుగులు చేశాడు.అక్టోబర్ 16 నుంచి టీ20 ప్రపంచకప్ టోర్నీ ప్రారంభం కానుంది.అక్టోబర్ 23న పాకిస్థాన్‌తో టీం ఇండియా తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube