టీ'లు అందించడానికి అయినా సిద్దమే అంటున్న హాట్ బ్యూటీ

సినిమా రంగంలో ఒకప్పుడు హీరో హీరోయిన్స్ గురించి మాట్లాడుకుంటే వారు సినిమాల్లో నటిస్తున్నప్పటికీ నిర్మాణ,దర్శకత్వం వంటి అంశాలపై కూడా చాలా ఆసక్తి కనబరుస్తూ ఉండేవారు.అయితే ఇప్పటి జనరేషన్ లో కూడా దాదాపు ప్రతి ఒక్క హీరో, హీరోయిన్స్ అలానే ఇతర రంగాల్లో కూడా రాణించాలని తెగ తాపత్రయపడుతున్నారు.

 Sunny Turns As A Producer-TeluguStop.com

ఇప్పటికే ఆలా ఇతర అంశాలపై కూడా కాలు మోపి తామేంటో నిరూపించుకున్న వారు చాలా మందే ఉన్నారు.ఈ లిస్ట్ లో తాజాగా హాట్ బ్యూటీ కూడా వచ్చి చేరింది.

అయితే ఈ ముద్దు గుమ్మ నిర్మాత రంగం లో అడుగుపెట్టినా ఏమాత్రం ఇగోలేదని,కావాలంటే ‘టీ’ లు కూడా అందిస్తాను అంటూ చెప్పుకువచ్చింది.ఇంతకీ ఆ ముద్దు గుమ్మ ఎవరు అని అనుకుంటున్నారా.

ఆమె హాట్ బ్యూటీ సన్నీ లియోన్.తాజాగా ఈ వయ్యారి ప్రొడక్షన్ హౌస్ నిర్మించి ఆ బ్యానర్‌లో సినిమాను తెరకెక్కించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే తన ప్రొడక్షన్ హౌస్ కు సంబందించిన అన్ని వ్యవహారాలను నా భర్త డేనియల్ వెబర్ చూసుకుంటాడు అని చెప్పిన ఈ ముద్దుగుమ్మ నిర్మాతను అయినందుకు నాకు ఎలాంటి ఈగో లేదని చెప్పింది.

అందరూ కూడా నాకు సమానమే, అవసరం అనుకుంటే షూటింగ్ టైం లో ‘టీ’లు అందించడానికి కూడా సిద్దమే అంటూ తెలిపింది.

సన్నీ లియోన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న తోలి సినిమా ఫిక్షన్,సైకలాజికల్ థ్రిల్లర్ గా ఉండబోతున్నట్లు సమాచారం.మరి ఇప్పటికే హాట్ హిరోయిన్ గా పేరు గడించిన ఈ భామ మరి నిర్మాతగా ఏ మాత్రం రాణిస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube