ఊహించని విధంగా గెస్ట్ రోల్ ప్లాన్ చేస్తున్న సుక్కూ.. మరి నటించే స్టార్ ఎవరు?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ (Pushpa: The Rise) ఘన విజయం సాధించింది.దీంతో పార్ట్ 2 పుష్ప ది రూల్ (Pushpa: The Rule) ను మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను బడ్జెట్ పరంగా ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

 Sukumar Planning Guest Role In Allu Arjun Pushpa The Rule Interesting Update Det-TeluguStop.com

ఈ సినిమాపై పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది.

ఇటీవలే అల్లు అర్జున్ పుట్టిన రోజు జరుపు కున్నారు.అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడున అదిరిపోయే వీడియో రిలీజ్ చేసి ఆడియెన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చాడు సుక్కూ.

ఫస్ట్ లుక్ మాత్రమే కాకుండా ఫస్ట్ లుక్ టీజర్ కూడా రిలీజ్ చేయడంతో బన్నీ ఫ్యాన్స్ కు మంచి అప్డేట్ అనే చెప్పాలి.

ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.పుష్ప 2 లో ఒక అతిథి పాత్ర ఉందని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.మరి తాజాగా ఈ అతిథి పాత్రపై క్రేజీ అప్డేట్ వినిపిస్తుంది.

పుష్ప 2 లో అతిథి పాత్రలో బాలీవుడ్ స్టార్ గెస్ట్ రోల్ లో కనిపించే ఛాన్స్ ఉందని.ఆ హీరో ఎవరో తెలియదు కానీ ఇదే నిజమైతే బాలీవుడ్ లో పుష్ప 2 కు మరింత గిరాకీ పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

అందుతున్న సమాచారం ప్రకారం.బన్నీ పాత్రను పరిచయం చేస్తూ వచ్చే ఈ అతిథి పాత్ర గొప్ప థ్రిల్లింగ్ గా ఉంటుందని.ఈ పాత్ర ఎవ్వరూ ఊహించని విధంగా సుకుమార్ (Sukumar) ప్లాన్ చేసినట్టు టాక్.ఈ సీక్వెల్ లో పార్ట్ 1 లో ఉన్న పాత్రలే కాకుండా పార్ట్ 2 లో సరికొత్త పాత్రలను కూడా పుష్ప 2 లో పరిచయం చేయబోతున్నాడు సుకుమార్.

మరి ఈ పార్ట్ 2 లో భాగం అయ్యే ఆ స్టార్స్ ఎవరు ముందు ముందు తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube