కత్తి మహేష్ మృతిపై శ్రీరెడ్డి సంచలన పోస్ట్.. మీ హీరో కూడా పోతాడంటూ?

ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ మృతి గురించి సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.కొంతమంది నెటిజన్లు కత్తి మహేష్ గురించి పాజిటివ్ గా పోస్టులు పెట్టిన వారిని సైతం ట్రోల్ చేస్తుండటం గమనార్హం.

 Sri Reddy Sensational Post About Kathi Mahesh Death, Kathi Mahesh Death, Sri Red-TeluguStop.com

చనిపోయిన తర్వాత కూడా కొంతమంది కత్తి మహేష్ ను ట్రోల్ చేస్తున్న నేపథ్యంలో శ్రీరెడ్డి ఒకింత ఘాటుగా స్పందించారు.ఫిల్మ్ జర్నలిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టిన కత్తి మహేష్ ఆ తరువాత రివ్యూ రైటర్ గా మారారు.

నటుడిగా చిన్న సినిమాల్లో వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుని ఆ ఆఫర్లతో కత్తి మహేష్ మంచి పేరును సంపాదించుకున్నారు.గతంలో కత్తి మహేష్ పలువురు సినీ ప్రముఖులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో పాటు శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

కత్తి మహేష్ చనిపోయినా కొంతమంది ఆయన కుటుంబ సభ్యులు బాధ పడే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటం గమనార్హం.

Telugu Kathi Mahesh, Netizens, Sensational, Sri Reddy, Srireddy-Movie

గతంలో శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమాం చేసిన సమయంలో శ్రీరెడ్డికి కత్తి మహేష్ తన మద్దతు ప్రకటించారు.శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో అందరూ ఏదో ఒకరోజు పోవాల్సిందేనని చెప్పారు.ఎవరైతే కత్తి మహేష్ మృతిని పండుగలా చెప్పుకుంటారో వాళ్లకు, కత్తి మహేష్ మృతిని అపహాస్యం చేసేవాళ్లకు ఇదే తన సమాధానం అని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పోస్ట్ లో చెప్పుకొచ్చారు.

Telugu Kathi Mahesh, Netizens, Sensational, Sri Reddy, Srireddy-Movie

ఒక హీరో ఫ్యాన్స్ కత్తి మహేష్ పై వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో మీ హీరో కూడా పోతాడని రేపో ఎల్లుండో మీరు కూడా పోవాలని శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.మీరు యుగపురుషులలా ఫోజులు కొట్టవద్దని కత్తి మహేష్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube