టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల( Sreeleela ) ఈ రోజు పుట్టిన రోజు( Sreeleela Birthday ) జరుపు కుంటున్న విషయం తెలిసిందే.దీంతో ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ ఫేవరేట్ యాక్టర్ కు బర్త్ డే విషెష్ చెబుతూ ఆమె నటిస్తున్న సినిమాల నుండి ఎలాంటి అప్డేట్స్ వస్తాయా అని ఎదురు చూస్తున్నారు.
మరి ఆమె ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ లు వచ్చేసాయి.ఇప్పటికే శ్రీలీల నటిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.
ఈ ఫస్ట్ లుక్ లో త్రివిక్రమ్ మార్క్ గ్లామ్ తో శ్రీలీల కనిపించగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.అచ్చం బాపు బొమ్మలా లంగా వోణీలో ఆకట్టుకునే అందంతో అందరిని ఆకట్టుకుంది.మరి ఇదే విధంగా ఈమె నటిస్తున్న మరో సినిమా నుండి కూడా ఫస్ట్ లుక్ రిలీజ్( Sreeleela First look release ) చేసారు మేకర్స్.శ్రీలీల నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్స్ లో అనిల్ రావిపూడి – బాలయ్య సినిమా కూడా ఉంది.
ఈ సినిమాకు ఇటీవలే భగవంత్ కేసరి అనే టైటిల్( Bhagavanth Kesari movie ) ను అనౌన్స్ చేసారు.మరి ఇందులో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపిస్తున్న విషయం విదితమే.
ఈ క్రమంలోనే ఈ అమ్మడి పుట్టిన రోజు కానుకగా ఈమె లుక్ ఎలా ఉండబోతుందో అని అంతా భావిస్తున్న తరుణంలో ఈ రోజు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు.ఈ ఫస్ట్ లుక్ కూడా అమితంగా ప్రేక్షకులను, ఫ్యాన్స్ ను ఆకట్టు కుంటుంది.
మరి ఈ ముద్దుగుమ్మ ఎలా ఆకట్టు కుంటుందో వేచి చూడాలి.ఇక ఇటీవలే బాలయ్య బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన భగవంత్ కేసరి టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుని సినిమాపై హోప్స్ పెంచేసాయి.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో దసరా కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.