ప్రతి పరిశ్రమలో ఆడవారికి అనేక ఇబ్బందులు ఉంటాయి.మగవారి ఆధిపత్యం ఎక్కువగా ఉండే సినీ పరిశ్రమలో( Movie Industry ) మరీ ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి.
అవకాశాల కోసం కొంతమంది తమ దగ్గరికి వచ్చే వారితో అసభ్యంగా ప్రవర్తించడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు.అలా ప్రయత్నించిన సందర్భంలో అవతల వారి మాటలకు లొంగితే కొంతమంది మాత్రం అవకాశాలు లేకపోయినా పర్వాలేదు ఆత్మవిమానమే ముఖ్యమని స్ట్రాంగ్ గా నిలబడతారు.
అలా నిలబడిన సందర్భంలో అవకాశాలు పోవడమే కాదు కొన్నిసార్లు అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.అన్నింటిని తట్టుకోని నిలబడిన వారికే ఈరోజు మంచి స్థాయి దొరుకుతుంది.
కానీ అందరి పరిస్థితిలో అలా ఉండవు.సింగర్ సునీత( Singer Sunitha ) సైతం తన జీవితంలో ఎన్నో రకాల అవమానాలను ఎదుర్కొన్నాను ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం.
ఒక పాట పాడాలి అంటే మ్యూజిక్ ఇండస్ట్రీలో( Music Industry ) చాలా దారుణమైన మాటలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని చాలామంది చెప్తూ ఉంటారు.అయితే సింగర్ సునీత సైతం ఇందుకు అతీతురాలు ఏమీ కాదు.ఆమె కూడా తన కెరీర్ లో( Career ) ఎన్నో రకాల అవమానాలను ఎదుర్కొన్నారట.వారికి కావాల్సింది ఇవ్వకపోతే మాటలతో వేధిస్తారు అంటూ సునిత చెబుతున్నారు.తాను కూడా ఎన్నోసార్లు ఇలా అవమానాలు ఎదుర్కొన్న దాన్ని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు.ఈ రోజు నేనున్న నా ఇమేజ్ కారణంగా నన్ను ఎవరు వేలెత్తి చూపి మాట్లాడరు.
కొన్నేళ్లు వెనక్కి వెళితే మాత్రం ఎవరు ఎలా పడితే అలా మాట్లాడేవారు.అన్ని తట్టుకోని నిలబడ్డాను కాబట్టే ఈరోజు ఈ స్థాయిలో ఉండగలిగాను.
దేవుడి దయ వల్ల ఎవరికి లొంగవలసిన అవసరం రాలేదు సినిమా పరిశ్రమలో ఏ బంధాలు శాశ్వతం కాదు.ఎవరి పైన ఆధారపడాల్సిన అవసరం లేదు మనలో టాలెంట్( Talent ) ఉంటే మనల్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి వచ్చిన ప్రతి అవకాశం ఒక వరం లాంటిది అది అందుకొని నిలబడ్డాను.కాబట్టే ఒంటరి మహిళగా ప్రయాణాన్ని ఏళ్లపాటు కొనసాగించాను ఈ రోజు నాకు ఒక తోడు దొరికింది .నేను సంతోషంగా ఉన్నాను.కానీ చాలామంది జీవితాలు నాలా ఉండవు.సినిమా పరిశ్రమ అంత సులువైన దారి కాదు అంటూ సునీత చెబుతున్నారు.