ప్రముఖ సింగర్ అరెస్ట్.. ఎందుకో తెలుసా?

సినీ పరిశ్రమలోని వ్యక్తులు కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తూ పోలీసులకు చిక్కుతుంటారు.తాజాగా ఇలాంటి ఘటన తమిళ ఇండస్ట్రీలో చోటు చేసుకుంది.

 Singer Arrested For Abusing Wife-TeluguStop.com

తమిళనాడుకు చెందిన ప్రముఖ సింగర్ ధరణి అతడి భార్యను వేధింపులకు గురిచేస్తున్నారనే ఫిర్యాదుపై పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

తమిళంలో ప్రముఖ సింగర్‌గా పేరొందిన పజని కుమారుడైన ధరణి కూడా సింగర్‌గా కెరీర్ సాగిస్తున్నాడు.

తన స్నేహితురాలైన విజయభానును ప్రేమించి పెళ్లాడాడు.ఆ సమయంలో విజయ భాను కుటుంబం నుండి భారీ మొత్తంలో కట్నకానుకలు స్వీకరించాడు ధరణి.

పెళ్లయిన తరువాత ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.ఈ క్రమంలోనే నిత్యా అనే మరో మహిళతో అక్రమం సంబంధం పెట్టుకున్న ధరణి విజయభానును మానసికంగా, శారీరకంగా వేధించడం, అధిక కట్నం కోసం వేధించడం చేస్తున్నాడు.

దీంతో విసుగుచెందిన ఆమె పోలీసులను ఆశ్రయించింది.

ప్రముఖ సింగర్ అరెస్ట్ ఎందుకో

భార్యను వేధింపులకు గురిచేస్తున్నట్లు కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.కాగా అతడికి సాయం చేసినట్లుగా ధరణి కుటుంబసభ్యులను కూడా అరెస్ట్ చేశారు.ఈ కేసుకు సంబంధించిన నిత్యాను కూడా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అక్రమ సంబంధం మోజులో కటకటాలపాలయ్యాడు ఈ ఘనుడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube