అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సంతితికి చెందిన రవాణా శాఖ మంత్రి ఎస్.ఈశ్వరన్‌ను సింగపూర్ ప్రధాని లీ హ్సీన్ లూంగ్( Lee Hsien Loong ) విధుల నుంచి నిషేధించిన సంగతి తెలిసిందే.
అలాగే అతని జీతంలోనూ కోత విధించారు.అవినీతిరహిత , స్థిరమైన రాజకీయాలకు పేరుగాంచిన సింగపూర్‌ను ఇటీవల చోటు చేసుకున్న కుంభకోణాలు కుదిపేశాయి.దీనిపై ప్రధాని పార్లమెంట్‌లో ప్రకటన చేశారు.61 ఏళ్ల ఈశ్వరన్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలు, విచారణ, ఇద్దరు పార్లమెంట్ సభ్యులు (ఎంపీలు) , మాజీ స్పీకర్ టాన్ చువాన్ జిన్, చెంగ్ లీ హుయ్‌ల వివాహేతర సంబంధం, రాజీనామాలపైనా లీ మాట్లాడారు.తదుపరి నోటీసు వచ్చే వరకు ఈశ్వరన్ వేతనాన్ని నెలకు 6,300 డాలర్లకు తగ్గించినట్లు ప్రధాని ప్రకటించారు.పబ్లిక్ సర్వీస్ డివిజన్ ప్రకారం.2023 నాటికి ఈశ్వరన్ నెలవారీ వేతనం 41,000 డాలర్ల వద్ద వుంది.అంటే వార్షికంగా 8,20,000 డాలర్లు.
అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈశ్వరన్( S Iswaran ), హోటల్ ప్రాపర్టీ లిమిటెడ్ ఎండీ ఓంగ్ బెంగ్ సెంగ్‌లను జూలై 11న అరెస్ట్ చేసినట్లు సీపీఐబీ ప్రకటించిన సంగతి తెలిసిందే.దర్యాప్తు తీరుపై ఏజెన్సీ తదుపరి వివరాలను మాత్రం వెల్లడించలేదు.అరెస్ట్ తర్వాత ఇద్దరిని బెయిల్‌పై విడుదల చేయగా.షరతులలో భాగంగా వారి పాస్‌పోర్ట్‌లను బ్యూరో స్వాధీనం చేసుకుంది.77 ఏళ్ల ఓంగ్ .విదేశాలకు వెళ్లేందుకు సీపీఐబీ అనుమతి లభించిన తర్వాత.ప్రైవేట్ విమానంలో బాలి నుంచి సింగపూర్‌కు తిరిగి వచ్చారు.అనంతరం 1,00,000 సింగపూర్ డాలర్ల పూచీకత్తుపై బెయిల్ లభించిన తర్వాత ఓంగ్ ఇండోనేషియాకు వెళ్లారు.
సింగపూర్‌ను ఫార్మూలా వన్ సర్క్యూట్‌లో భాగమయ్యేలా చేయడంలో ఈశ్వరన్, ఓంగ్ కీలక పాత్ర పోషించారు.ఓంగ్ సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.ఇది ప్రతి యేటా మెరీనా బే స్ట్రీట్ సర్క్యూట్‌లో ఎఫ్ 1 నైట్ రేసును నిర్వహిస్తున్నారు.2000లో ఈశ్వరన్ (ఆ సమయంలో జూనియర్ వాణిజ్య మంత్రి), ఓంగ్‌లు కలిసి అప్పటి ఫార్ములా వన్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నీ ఎక్లెస్టోన్‌ను సింగపూర్( Singapore )లో 2008లో ప్రారంభమయ్యే రేస్‌కు వేదికగా చేసేందుకు ఒప్పించారు.