ఇకపై అన్నీ అంటోన్న బ్యూటీ.. ఎవరో తెలుసా?

కోలీవుడ్ బ్యూటీ, తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.ఇక ఈ బ్యూటీ తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకుని తన సత్తా చాటింది.

 Shruti Hassan Ready For Glam Show, Shruti Hassan, Krack, Vakeel Saab, Tollywood-TeluguStop.com

అయితే కొంతకాలం వరుసగా సినిమాలు చేసిన ఈ బ్యూటీ, త్వరగానే స్టార్ బ్యూటీ స్థాయిని చేజిక్కించుకుంది.అయితే కొన్ని సినిమాల తరువాత ఆమె వరుసగా సినిమాలను తగ్గిస్తూ వచ్చింది.

కాగా ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి క్రాక్ చిత్రంతో వస్తున్న ఈ బ్యూటీ వరుసగా ఆఫర్లు వస్తాయని ఆశిస్తోంది.ఇటు ఇప్పటివరకు శృతి హాసన్ చేసిన సినిమాల్లో అందాల ఆరబోతకు పెద్దగా స్కోప్ దొరకలేదు.

దీంతో ఇప్పుడు అందాల ఆరబోతలో ఎలాంటి పరిమితులు లేకుండా ప్రేక్షకులకు కనులవిందు చేసేందుకు రెడీ అవుతోంది.ప్రస్తుతం హాట్ హాట్ ఫోటోషూట్‌లతో రెచ్చిపోతున్న ఈ బ్యూటీ, సినిమాల్లోనూ రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసేందుకు రెడీ అంటోంది.

ఇక అందాల ఆరబోతలో శృతిమించేందుకు కూడా అమ్మడు ఓకే అంటోంది.అందుకే బికినీ వేసుకుని మరీ కుర్రకారుకు నిద్రలేకుండా చేయాలని చూస్తోంది.

మరి బికినీ వేసుకుంటానంటోన్న శృతి హాసన్‌కు టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఎలాంటి ఆఫర్లు ఇస్తారో చూడాలి.కాగా క్రాక్ సినిమాతో పాటు శృతి హాసన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రంలోనూ నటిస్తుందనే వార్త ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube