టీ20 వరల్డ్ కప్ వాయిదా..!

కరోనా రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు క్రీడ పోటీలు వాయిదా పడ్డాయి.తాజాగా టీ20 వరల్డ్ కప్ పోటీలను వాయిదా వేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఐసీసీ నిర్ణయం తీసుకుంది.ఈ పురుషుల టీ20 వరల్డ్ కప్ పోటీలు 2021 అక్టోబర్ నెలలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది.

వచ్చే ఏడాది నవంబర్ 14వ తేదీన టీ20 ఫైనల్ మ్యాచ్ ను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జరగాల్సిన పోటీలను వచ్చే ఏడాదిలో అక్టోబర్ 18వ తేదీ నుంచి నవంబర్ 15 వరకు ఈ పోటీలను నిర్వహించాలని పేర్కొంది ఐసీసీ.

దీంతో పాటు 2022 టీ20 పురుషుల వరల్డ్ కప్ పోటీలు అక్టోబర్-నవంబర్ నెలలో నిర్వహించనున్నారు.ఇక ఫైనల్ మ్యాచ్ ను అదే ఏడాది నవంబర్ 13న జరగనుందని ఐసీసీ వెల్లడించింది.

Advertisement

ఇక 2023 టీ20 వరల్డ్ కప్ పోటీలు అక్టోబర్- నవంబర్ మధ్య నిర్వహించనున్నట్లు ప్రకటించింది.ఫైనల్ మ్యాచ్ 2023 నవంబర్ 26న జరగనుందని ఐసీసీ తెలిపింది.

అయితే ఈ ఏడాది పోటీలు అస్ట్రేలియాలో జరగాల్సి ఉంది.మరోవైపు 2021, 2022 టీ 20 వరల్డ్ కప్ పోటీలు ఎక్కడ నిర్వహిస్తారో ఐసీసీ స్పష్టత ఇవ్వలేదు.

Advertisement

తాజా వార్తలు