తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ( CM kcr )పోటీ చేస్తున్నారు.గజ్వేల్ తో పాటు కామరెడ్డి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు.
గజ్వేల్ లో కెసిఆర్ కు పెద్దగా ఇబ్బందులు లేకపోయినా, కామారెడ్డిలో మాత్రం ఎదురీదాల్సిందేనన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.మొదటి నుంచి బీఆర్ఎస్ కు కామారెడ్డిలో అంతగా పట్టులేదు.
ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినా, స్వల్ప మెజార్టీతోనే గెలుస్తున్నారు .ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇప్పటికీ బలంగా ఉండడంతో ,కేసిఆర్ గెలుపు అంత సులువు కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కేసీఆర్ కు ప్రత్యర్ధి గా కాంగ్రెస్ నుంచి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy )పోటీ చేస్తున్నారు.కెసిఆర్ ను ఓడించాలన్న పట్టుదలతో ఉన్న రేవంత్ ఈ నియోజకవర్గంలో పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే పనుల్లో నిమగ్నం అయ్యారు.
తరుచుగా ఈ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలతో( Congress ) సమావేశాలు నిర్వహిస్తూ , ప్రజల్లోకి కాంగ్రెస్ తీసుకువెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.దీంతోపాటు కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ తో సహా అనేక సమస్యలు బీ ఆర్ ఎస్ ( BRS )కు ఇబ్బందికరంగా మారాయి.రైతులు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. కేసీఆర్ పై భారీగా రైతులు పోటీ చేస్తామని, నామినేషన్ వేస్తామని ప్రకటించారు.గతంలో మాదిరిగా తెలంగాణ సెంటిమెంట్ పెద్దగా లేకపోవడం , రెండుసార్లు బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో సహజంగానే ప్రజల్లో వ్యతిరేకత ఉండడం, ఇవన్నీ కేసీఆర్ గెలుపు అవకాశాలపై ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది.
కెసిఆర్ ప్రత్యర్థైన రేవంత్ రెడ్డి కామారెడ్డిలో కెసిఆర్ ( CM kcr )ను ఓడించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ఉండడం , సహజంగానే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు గట్టిపట్టు ఉండడంతో కేసీఆర్ కూడా టెన్షన్ పడుతున్నారట.దీంతో ఈ నియోజకవర్గంలో తన గెలుపుకు డోకా లేకుండా చేసుకునేందుకు పార్టీకి చెందిన కీలక నేతలు అందరినీ రంగంలోకి దింపి నియోజకవర్గమంతా ఎన్నికల ప్రచారం మరింత ముమ్మరం చేసినా, ఇక్కడ పరిస్థితులు కేసిఆర్ కు కంగారు పుట్టిస్తున్నాయట.