Posani Krishna Murali: సొంత తమ్ముడిలా చూసుకున్నా పోసానిని మోసం చేసిన వ్యక్తి ఎవరో తెలుసా?

ప్రముఖ టాలీవుడ్ నటుడు, రచయితలలో ఒకరైన పోసాని కృష్ణమురళి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను ఆర్టిస్ట్ అయిన తర్వాత నా శిష్యులు నాకు వేషాలు చెబుతున్నారని నా గురువులు నాకు వేషాలు చెబుతున్నారని తెలిపారు.నేను నేర్పించిన శిష్యులే నన్ను డైరెక్ట్ చేస్తుంటే చాలా థ్రిల్ గా ఫీలవుతున్నానని పోసాని తెలిపారు.

 Shocking Facts About Posani Krishnamurali Details, Muthyala Subbaiah, Posani Kri-TeluguStop.com

ఈ అదృష్టం ఎవరికీ రాదేమో అని అనిపిస్తుందని పోసాని కామెంట్లు చేశారు.

నేను మంచి వ్యక్తినని అందుకే నాకు వాళ్లు ఆఫర్లు ఇస్తారని పోసాని కృష్ణమురళి వెల్లడించారు.

ఆకుల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, సంపత్ నంది నా శిష్యులు అని పోసాని కామెంట్లు చేశారు.కళ్యాణ్ కృష్ణ కూడా నా శిష్యుడేనని పోసాని పేర్కొన్నారు.ఈ విషయంలో నేను చాలా లక్కీ అని పోసాని కామెంట్లు చేయడం గమనార్హం.పూరీ జగన్నాథ్ నా టాలెంట్ నచ్చి అవకాశాలు ఇచ్చారని ఆయన అన్నారు.

పూరీ గారి సినిమాల్లో అవకాశాలు రావడం పూర్వజన్మ సుకృతం అని ఆయన కామెంట్లు చేశారు.

Telugu Puri Jagannadh, Posanikrishna, Sampath Nandi, Tollywood-Movie

అయితే ఒక వ్యక్తి పేరు చెప్పడం మాత్రం నాకు అస్సలు ఇష్టం లేదని ఆయన తెలిపారు.ఆ వ్యక్తి చేతిలో మోసపోయానని ఆ వ్యక్తి మా ఊరి వ్యక్తి అని పోసాని వెల్లడించారు.అన్నా అని నన్ను పిలిచేవాడని సొంత తమ్ముడిలా నేను చూసుకున్నానని అతనిని గుడ్డిగా నమ్మానని పోసాని తెలిపారు.

Telugu Puri Jagannadh, Posanikrishna, Sampath Nandi, Tollywood-Movie

నా దగ్గర 30 మంది ఉన్నారని అతనిని ముత్యాల సుబ్బయ్య దగ్గర పెట్టానని పోసాని చెప్పుకొచ్చారు.ఆ వ్యక్తి దర్శకుడు అయిన తర్వాత కాలు మీద కాలేసుకుని ఆ వ్యక్తి తల కోసేయాలనేంత కోపం ఉందని పోసాని తెలిపారు.పోసాని వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పోసానికి ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube