చిరంజీవి వస్తారని ఫ్యాన్స్ ఎదురుచూస్తే మేకప్ మేన్ వచ్చాడట.. ఏం జరిగిందంటే?

సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.చిరంజీవి( Chiranjeevi ) క్లాస్, మాస్ అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథాంశాలలో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు.

 Shocking And Interesting Facts About Chiranjeevi Details, Chiranjeevi, Chiranjee-TeluguStop.com

సాధారణంగా సినీ హీరోలు వస్తున్నారంటే ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.కనీసం దూరం నుంచి అయినా తమ ఫేవరెట్ హీరోలను చూడాలని కోరుకునే అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు.

ఒకానొక సమయంలో కొంతమంది ఫ్యాన్స్ పద్మాలయ స్టూడియోలో( Padmalaya Studio ) షూటింగ్ చూడటానికి వచ్చారు.

షూటింగ్ చూసి తిరిగి వెళ్తున్న సమయంలో అక్కడ టెలిఫోన్ సంభాషణ విన్నారు.

ఆ సంభాషణలో ” నువ్వు అక్కడే ఎయిర్ పోర్ట్ లో ఉండు.టికెట్లు ఓకే అయ్యాయి కదా.శరత్ బాబు గారు ఇక్కడినుంచి ఎయిర్ పోర్ట్ కు వచ్చేస్తారు.చిరంజీవి గారిని తీసుకుని నువ్వు అక్కడికి వచ్చేయ్.జాగ్రత్త” అదీ సంభాషణం కాగా స్టూడియో నుంచి బయలుదేరుతున్న సందర్శకులు ఠక్కున ఆగిపోయారు.

చిరంజీవి ఎయిర్ పోర్ట్ అనే మాటలు విన్న వెంటనే చాలామంది ఎయిర్ పోర్ట్ దగ్గరికి వెళ్తే చిరంజీవిని చూడొచ్చని అక్కడికి వెళ్లిపోయారు.అయితే విమానాశ్రయానికి శరత్ బాబు( Sarath Babu ) వచ్చినా చిరంజీవి ఎంతసేపటికీ రాలేదు.కొంతమంది ఫ్యాన్స్ ఏం చేయాలో పాలుపోక శరత్ బాబును సార్ మీ పేరు, చిరంజీవి పేరు ఫోన్ సంభాషణలో విన్నామని చిరంజీవి ఎక్కడ సార్ అని అడిగారు.

ఆ మాటలకు శరత్ బాబు వెంటనే నవ్వి “సారీ బాబూ.మీరు విన్నది కరెక్టే.చిరంజీవి గారంటే ఈయనే నా మేకప్ మేన్( Makeup Man ) ఈయన పేరు విని మీరు మెగాస్టార్ చిరంజీవి అనుకున్నారు పాపం” అని అన్నాడట.శరత్ బాబు మాటలు విని షాకవ్వడం చిరంజీవి ఫ్యాన్స్ వంతైంది.

చిరంజీవి రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube