చిరంజీవి వస్తారని ఫ్యాన్స్ ఎదురుచూస్తే మేకప్ మేన్ వచ్చాడట.. ఏం జరిగిందంటే?

సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.చిరంజీవి( Chiranjeevi ) క్లాస్, మాస్ అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథాంశాలలో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు.

సాధారణంగా సినీ హీరోలు వస్తున్నారంటే ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.కనీసం దూరం నుంచి అయినా తమ ఫేవరెట్ హీరోలను చూడాలని కోరుకునే అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు.

ఒకానొక సమయంలో కొంతమంది ఫ్యాన్స్ పద్మాలయ స్టూడియోలో( Padmalaya Studio ) షూటింగ్ చూడటానికి వచ్చారు.

షూటింగ్ చూసి తిరిగి వెళ్తున్న సమయంలో అక్కడ టెలిఫోన్ సంభాషణ విన్నారు.ఆ సంభాషణలో " నువ్వు అక్కడే ఎయిర్ పోర్ట్ లో ఉండు.

టికెట్లు ఓకే అయ్యాయి కదా.శరత్ బాబు గారు ఇక్కడినుంచి ఎయిర్ పోర్ట్ కు వచ్చేస్తారు.

చిరంజీవి గారిని తీసుకుని నువ్వు అక్కడికి వచ్చేయ్.జాగ్రత్త" అదీ సంభాషణం కాగా స్టూడియో నుంచి బయలుదేరుతున్న సందర్శకులు ఠక్కున ఆగిపోయారు.

"""/" / చిరంజీవి ఎయిర్ పోర్ట్ అనే మాటలు విన్న వెంటనే చాలామంది ఎయిర్ పోర్ట్ దగ్గరికి వెళ్తే చిరంజీవిని చూడొచ్చని అక్కడికి వెళ్లిపోయారు.

అయితే విమానాశ్రయానికి శరత్ బాబు( Sarath Babu ) వచ్చినా చిరంజీవి ఎంతసేపటికీ రాలేదు.

కొంతమంది ఫ్యాన్స్ ఏం చేయాలో పాలుపోక శరత్ బాబును సార్ మీ పేరు, చిరంజీవి పేరు ఫోన్ సంభాషణలో విన్నామని చిరంజీవి ఎక్కడ సార్ అని అడిగారు.

"""/" / ఆ మాటలకు శరత్ బాబు వెంటనే నవ్వి "సారీ బాబూ.

మీరు విన్నది కరెక్టే.చిరంజీవి గారంటే ఈయనే నా మేకప్ మేన్( Makeup Man ) ఈయన పేరు విని మీరు మెగాస్టార్ చిరంజీవి అనుకున్నారు పాపం" అని అన్నాడట.

శరత్ బాబు మాటలు విని షాకవ్వడం చిరంజీవి ఫ్యాన్స్ వంతైంది.చిరంజీవి రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉంది.

ప్రశాంత్ నీల్ మూవీలో తారక్ క్యారెక్టర్ ఇదే.. నరరూప రాక్షసుడిగా కనిపిస్తారా?