వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ( Y.S Sharmila )ఇప్పుడు తెలంగాణలో ఊహించిన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.దీనంతటికీ కారణం షర్మిల రాజకీయ వ్యూహాలు బెడిసి కొట్టడమే.వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన సమయంలో ఆమె తప్పకుండా అధికారంలోకి వస్తామనే నమ్మకాన్ని వ్యక్తపరిచారు.అంతేకాదు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని ఎన్నో విమర్శలు చేశారు.అలాగే తెలంగాణ అంతటా పాదయాత్ర నిర్వహించి రికార్డు సృష్టించారు.
మొదట్లో షర్మిల స్పీడ్ చూసి ఊహించని స్థాయిలో ఆ పార్టీ తెలంగాణలో బలపడుతుందని అందరూ అంచనా వేశారు.కొంతమంది ఇతర పార్టీలలోని కీలక నేతలు షర్మిల పార్టీలో చేరారు .అయితే రాను రాను ఆ పార్టీ పరిస్థితి గందరగోళంగా మారడం, ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి నెలకొనడంతో పాటు, పాలేరు నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని ప్రకటించి ఆ తర్వాత విరమించుకుని కాంగ్రెస్ కు ( Congress )మద్దతు పలుకుతున్నట్లుగా పేర్కొనడంతో , ఒక్కసారి షర్మిల పై అంచనాలు పెట్టుకున్న వారు షాక్ కి గురయ్యారు.
ముఖ్యంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ లో కీలకంగా ఉన్న నేతలు ఒక్కసారిగా ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన కీలక నేత గట్టు రామచంద్రరావు( Gattu ramachandar Rao ) నేతృత్వంలోని కొంతమంది కీలక నేతలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో షర్మిల పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.మూకమ్మడిగా పార్టీకి రాజీనామాలు చేశారు.
ఈ సందర్భంగా షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడమే కాకుండా, తెలంగాణ ప్రజలను మోసం చేసిన షర్మిల తెలంగాణను విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు .ఈ సందర్భంగా గట్టు రామచంద్రరావు షర్మిలపై ఒక్కసారి గా ఫైర్ అయ్యారు. రాజశేఖర్ రెడ్డి పేరును ఆమె చెడగొట్టారని, కాంగ్రెస్ తో పోరాడుతా అని చెప్పి, చివరకు కాంగ్రెస్ చెంతకు చేరి మమ్మల్ని రోడ్డుమీద నిలబెట్టారని మండిపడ్డారు.
ఇన్ని రోజులు షర్మిలను సపోర్ట్ చేసినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతున్నామని, మేమంతా షర్మిలను తెలంగాణ నుంచి బహిష్కరిస్తున్నామని, షర్మిల రాజకీయాలకు పనికిరారని రామచందర్రావు మండిపడ్డారు .అసలు వైఎస్సార్ తెలంగాణ పార్టీతో షర్మిలకు ఎటువంటి సంబంధం లేదని ,ఆమెకు సభ్యత్వమే లేదని ప్రకటించారు.ఈ పరిస్థితుల నేపథ్యంలో షర్మిల రాజకీయ పరిస్థితి గందరగోళంగా మారింది.
.