20 ఏళ్లకు ముందు మలయాళం, తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో షకీలా సినిమాలకు ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.స్టార్ హీరోల సినిమాలను మించి షకీలా సినిమాల వసూళ్లు నమోదు అయ్యేవి.
ముఖ్యంగా మలయాళంలో సూపర్ స్టార్స్‌కు కూడా చుక్కలు చూపించింది షకీలా.అలాంటి షకీలా ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది.
ఆమెను మర్చి పోతున్న సమయంలో ఏదో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నేనున్నాను అంటూ చెప్పకనే చెప్పుకుంటుంది.
తాజాగా షకీలా ఒక సినిమాతో రచయిత్రిగా మారింది.ఆ సినిమాకు టైటిల్ షకీలా రాసిన మొదటి కుటుంబ కథా చిత్రం అంటూ టైటిల్‌ను పెట్టారు.ఆ సినిమాలో షకీలా కూడా కీలక పాత్రలో కనిపించబోతుంది.
విడుదలకు సిద్దం అయిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారి నుండి క్లియరెన్స్ రావడం లేదు.టైటిల్‌లోనే బూతు ఉన్నట్లుగా సెన్సార్ బోర్డు వారు అంటున్నారట.
సెంట్రల్ బోర్డుకు వెళ్లి సెన్సార్ చేయించుకునేందుకు ఈమె ప్రయత్నాలు చేస్తుంది.
ఇదే సమయంలో ఈమె సెన్సార్ బోర్డు తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.చాలా సంవత్సరాల క్రితం తాను ఒక సినిమాను నిర్మిస్తే దానికి సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వక పోవడంతో అది ఇంకా కూడా విడుదల కాలేదు.ఇప్పుడు నేను రచయిత్రిగా పరిచయం అవుతూ చేసిన సినిమాకు కూడా సెన్సార్ ఇవ్వక పోవడం దారుణం అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
నా ప్రతి సినిమాకు ఇలా అడ్డంకులు పెడితే ఎలా అంటూ సెన్సార్ బోర్డు వారిపై ఎమోషనల్‌గా కామెంట్స్ చేసింది.ఈ సినిమాకైనా సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వాలంటూ ఆమె విజ్ఞప్తి చేస్తోంది.