ఉండాలా వద్దా ? తెలుగు తమ్ముళ్లకు పెద్ద కష్టమొచ్చిందే ?

పార్టీ ప్రస్తుత పరిస్థితి చూసి తెలుగు తమ్ముళ్లు లో ఎక్కడ లేని ఆందోళన కనిపిస్తోంది.వరుసగా ఎదురవుతున్న పరిణామాలు చూస్తే అధికార పార్టీ వైసిపి టిడిపి నాయకులే టార్గెట్ గా వ్యవహారాలు చేస్తూ ముందుకు వెళ్తోంది.

 Senior Leaders In Tdp Decided To Leave-TeluguStop.com

ఇప్పటికే ఈ వేధింపుల కారణంగా అనేక మంది పార్టీని వీడి వెళ్లిపోగా ఇప్పుడు పార్టీలో ఉన్న కీలక నాయకులు, ఎమ్మెల్యేలు ఆందోళనగా ఉంటూ వస్తున్నారు.ఏదో ఒక కేసులో తాము ఇరుక్కునే అవకాశం ఉండడం, ఎవరినీ వదలకుండా అందరిపైనా వైసీపీ టార్గెట్ పెట్టడంతో పాటు ఇంకా జగన్ ప్రభుత్వానికి నాలుగేళ్లకు పైగా సమయం ఉండడంతో అప్పటికీ తమ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది అనే భయం టిడిపి నాయకులకు వచ్చేసింది.
తాము పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నాఇప్పుడప్పుడే పార్టీ కోలుకునే పరిస్థితి లేకపోవడం తదితర పరిణామాల నేపథ్యంలో టిడిపిని వీడడం తప్ప తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఆలోచనకు చాలామంది నాయకులు వచ్చేశారు.పార్టీ వీడి బయటకు వెళ్ళిపోదాం అనుకున్న ప్రతిసారి చంద్రబాబు ఏదో ఒక ప్రజా ఉద్యమం పేరుతో జనాల్లోకి వెళ్లడం, ఆ సమయంలో పార్టీ భవిష్యత్తుపై భరోసా వస్తుండడంతో ఎప్పటికప్పుడు నాయకులు తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు.

అయితే ఎన్ని ప్రజా ఉద్యమాలు, ఆందోళన చేసినా, అధికార పార్టీ ఎత్తుగడలు ముందు తమ పప్పులు ఉడకవు అనే అభిప్రాయానికి వచ్చేసారు.

Telugu Andhra Pradesh, Congress, Seniortdp, Tdp-Telugu Political News

దీనికి తోడు కేంద్ర అధికార పార్టీ బీజేపీ కూడా వైసిపి ప్రభుత్వానికి పలు రకాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉండటంతో టిడిపి నాయకులు హడలిపోతున్నారు.టిడిపిలో సీనియర్ నాయకులు రాష్ట్రస్థాయిలో రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకులు ఇప్పుడు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.వీరందరికీ ప్రత్యామ్నాయంగా ఇప్పుడు బీజేపీనే కనిపిస్తోంది.

కొంతమంది వైసీపీలోకి వెళ్లాలని ఆశపడుతున్నా ఆ పార్టీ నుంచి సానుకూలమైన వాతావరణం కనిపించకపోవడంతో బీజేపీలోకి వెళితే మంచిదనే ఆలోచనకు నాయకులు వచ్చేశారు.
తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్న సమయంలో కీలకంగా వ్యవహరించిన నాయకులు ఇప్పుడు అనేక వ్యవహారాల్లో చిక్కుకుని అధికారపార్టీ వేధింపులకు గురవుతున్నారు.

ఈ సమయంలో తమకు అండగా ఉండాల్సిన పార్టీ పెద్దగా పట్టించుకోకపోవడంపై వీరు ఆగ్రహంగా ఉన్నారు.ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నాయకులంతా టిడిపిలో ఉండి ప్రయోజనం ఉండదనే ఆలోచనతో పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube