తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నటువంటి అతిపెద్ద కామెడీ షో జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమం దాదాపు పది సంవత్సరాలకు పైగా కొనసాగుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది.
ఇక ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్లుగా ప్రేక్షకులకు పరిచయమయ్యే అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకొని హీరోలుగాను దర్శకులు కొనసాగుతూ ఉన్నారు.ఇక పోతే ఈ కార్యక్రమానికి మొదట్లో రోజా( Roja ) నాగబాబు (Nagababu) జడ్జిలుగా వ్యవహరించే వరకు కొన్ని కారణాలవల్ల నాగబాబు వెళ్లిపోవడంతో సింగర్ మనో వచ్చారు.
ఇక రోజాకి మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆమె కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఇంద్రజ జడ్జిగా వచ్చారు.
ఇక మను స్థానంలో కృష్ణ భగవాన్ జడ్జిగా వచ్చారు.అయితే ఈ మధ్యకాలంలో వరుసగా కుష్బూ (Kushboo) ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ కార్యక్రమం నుంచి కుష్బూ కూడా తప్పుకున్నారని తెలుస్తుంది ఈమె స్థానంలో మరొక స్టార్ హీరోయిన్ సీనియర్ నటి మహేశ్వరి( Maheswari ) జడ్జిగా హాజరయ్యారు.
తాజాగా చూపించిన ప్రోమోలో మహేశ్వరి కుష్బూ స్థానంలో ఉండి సందడి చేశారు.అయితే ఈమె ఇదొక ఎపిసోడ్ కి మాత్రమే వస్తారా లేక పర్మినెంట్ జడ్జిగా ఉండబోతున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది.
ఇక ఈ కార్యక్రమానికి కొత్త యాంకర్ కూడా వచ్చిన సంగతి మనకు తెలిసిందే మొదట్లో అనసూయ ( Anasuya )యాంకర్ గా వ్యవహరించేది అనంతరం సౌమ్యరావు యాంకర్ గా పరిచయమయ్యారు అయితే ఉన్నఫలంగా సౌమ్యరావు జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళిపోవడంతో బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సిరి హనుమంతు(Siri Hanumanth) ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు అయితే ఇప్పటికే ఈమె రెండు వారాలను పూర్తిచేసుకుని తన మాట తీరుతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారని చెప్పాలి.