Salaar Movie : సలార్ సినిమాను ఉచితంగా చూసే బంపర్ ఆఫర్.. టికెట్లు ఎలా పొందాలంటే?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్.ప్రశాంత్ నీల్ ( Prashanth Neel )దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 22న విడుదల కానున్న విషయం తెలిసిందే.

 Salaar Team Announced A Bumper Offer What Is That Offer-TeluguStop.com

ఈ సినిమాలో ప్రభాస్ సర్సన శృతిహాసన్( Sruthi Haasan ) హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా కోసం సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా కళ్ళు కాయలు కాచే విధంగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్లు సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు.

ఇక ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటించాడు.

Telugu Bumper, Jagapathi Babu, Prabhas, Prashanth Neel, Salaar, Sruthi Haasan, T

అలాగే జగపతి బాబు, టిన్నూ ఆనంద్, ఈశ్వరి రావ్ మరియు శ్రియ రెడ్డి వంటి వారు ముఖ్యమైన పాత్రలు పోషించారు.ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు.కెజిఎఫ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన హోంబలె ఫిల్మ్ ఈ సలార్ ను కూడా తెరకెక్కించింది.

ఇదిలా ఉంటే డార్లింగ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ నేడు అనగా డిసెంబర్ ఒకటి సాయంత్రం 7: 19 నిమిషాలకు విడుదల కానుంది.ట్రైలర్ రిలీజ్ కు ఒక రోజు ముందు గురువారం నవంబర్ 30 సలార్ టీమ్ తమ అధికారిక ఎక్స్ అకౌంట్లో ఈ ఫొటోను షేర్ చేసింది.

బెస్ట్ 5 క్యాప్షన్లకు మీ దగ్గర్లోని థియేటర్లలో ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లతో పాటు సలార్ మెర్చండైజ్ కూడా గిఫ్ట్ గా ఇస్తాం.

Telugu Bumper, Jagapathi Babu, Prabhas, Prashanth Neel, Salaar, Sruthi Haasan, T

సలార్ సీజ్‌ఫైర్ ట్రైలర్ డిసెంబర్ 1 సాయంత్రం 7.19 గంటలకు రానుంది అనే క్యాప్షన్ తో ఈ ఫొటోను షేర్ చేశారు.ఇక ట్రైలర్ రిలీజ్ పై నెలకొన్న ఉత్కంఠను మరింత పెంచుతూ సలార్ ( Salaar movie )టీమ్ గురువారం నవంబర్ 30 ఒక ప్రోమోను కూడా రిలీజ్ చేయడం విశేషం.

అధీర ఎడిట్ చేసిన ఈ ప్రోమోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.సలార్ సీజ్ ఫైర్ ట్రైలర్ డిసెంబర్ 1 సాయంత్రం 7.19 గంటలకు పేలడానికి సిద్ధంగా ఉందంటూ సలార్ టీమ్ ఈ ప్రోమో పోస్ట్ చేసింది.ఈ ప్రోమో ట్రైలర్ పై అంచనాలను మరింత పెంచేసింది.

అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోరుతో పిచ్చెక్కించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube