అలాంటి పాత్రలు చేస్తే మానాన్న ఏడుస్తారు అంటున్న సాయి పల్లవి

సౌత్ సినిమాలలో నటిగా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ముద్దుగుమ్మ సాయి పల్లవి.మొదటి సినిమా నుంచి ప్రస్తుతం విరాటపర్వం వరకు ఆమె చేస్తున్న ప్రతి సినిమాలోని పాత్రలు దేనికవే ప్రత్యేకం.

 Sai Pallavi Said Her Parents Not Like Sad Roles, Tollywood, Telugu Cinema, Kolly-TeluguStop.com

కణం లాంటి సినిమాలో వయసుకి మించిన పాత్రలో ఓ తల్లిగా నటించి మెప్పించింది.ఇక ప్రతి సినిమాలో నటన పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ తాను ఎందుకు అంత ప్రత్యేకమో సాయి పల్లవి చెప్పకనే చెబుతుంది.

రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకి దూరంగా హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న కథలని ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ లిస్టులో ఇప్పుడు మూడు సినిమాల వరకు ఉన్నాయి.తాజాగా పావ కథైగల్ అనే వెబ్ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

నాలుగు కథల సమాహారంగా నడిచే ఈ కథలో సాయి పల్లవి, ప్రకాష్ రాజ్ తండ్రి కూతుళ్ళుగా ఒక కథలో కనిపిస్తారు.ఈ సినిమా రిలీజ్ సందర్భంగా సాయి పల్లవి మీడియా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది.

Telugu Kollywood, Sai Pallavi, Shyam Singarai, Telugu, Tollywood, Virataparvam-L

తనకి సినిమాలలో ఏడ్చే పాత్రలు అంటే చాలా ఇష్టం అని అయితే అలాంటి పాత్రలు చేయడం మా పేరెంట్స్ కి అస్సలు ఇష్టం ఉండదని సాయి పల్లవి చెప్పుకొచ్చింది.అలాంటి సినిమాలు అమ్మ, నాన్నతో కలిసి చూసినపుడు తాను వారి ఎక్స్ ప్రెషన్ అబ్జర్వ్ చేస్తానని తనని ఏడుస్తూ స్క్రీన్ పై చూస్తే మా నాన్న కూడా ఏడ్చేస్తారని చెప్పుకొచ్చింది.అందుకే వీలైనంత వరకు అలాంటి పాత్రలు చేయడానికి దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది.అయితే కొన్ని సినిమాలు పాత్రలు విన్న తర్వాత ఓకే చెప్పేస్తూ ఉంటానని చెప్పింది.ఇదిలా ఉంటే సాయి పల్లవి తెలుగులో ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం, శ్యామ్ సింగరాయ్ సినిమాలో నానికి జోడీగా అలాగే అయ్యప్పన్ కోశియమ్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ కి జోడీగా నటించబోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube