మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar ) గురించి పరిచయం అవసరం లేదు క్రికెట్ దేవుడిగా అభిమానులు ఈయనని పూజిస్తుంటారు.క్రికెట్( Cricket ) రంగంలో ఎన్నో ఆటలు ఆడుతూ ఎన్నో సరికొత్త రికార్డులను సృష్టించినటువంటి సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం క్రికెట్ కు పూర్తిగా దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా సచిన్ టెండూల్కర్ చేసినటువంటి రికార్డులను ఎప్పుడు కూడా ఏ ఆటగాడు చెరిపేయలేదు ఇలా ఈయన కొన్ని రికార్డ్స్ ఇప్పటికీ అలాగే భద్రంగా ఉన్నాయని చెప్పాలి.ఇలా క్రికెట్ నే తన ఊపిరిగా ఉన్నటువంటి సచిన్ టెండూల్కర్ క్రికెట్ నుంచి తప్పకున్న తర్వాత కూడా ఈయనకు ఆటపై ఏమాత్రం అభిమానం తగ్గలేదు.
గత జరిగినటువంటి ప్రపంచ వరల్డ్ కప్ మ్యాచ్లో భాగంగా టీమిండియాని ఎంతో ప్రోత్సహించినటువంటి టెండూల్కర్ ఈ వరల్డ్ కప్ మ్యాచ్లో ఇండియా ఓడిపోవడంతో వారిని ప్రశంసిస్తూ మరింత ఎంకరేజ్ చేశారు.తాజాగా సచిన్ గురించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది.తమకు మంచి జీవితాన్ని ఇచ్చినటువంటి వారిని మనం దేవుడితో సమానంగా భావిస్తూ ఉంటాము అలాంటి వారికి మనం గౌరవం ఇస్తాము.ఈ క్రమంలోనే టెండూల్కర్ కూడా తనకు ఇంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టినటువంటి క్రికెట్ రంగాన్ని కూడా అదే విధంగా గౌరవిస్తారని చెప్పాలి.
ఇలా ఈయన క్రికెట్ కి పూర్తిగా రిటైర్మెంట్ ఇచ్చినప్పటికీ తన పూజ గదిలో మాత్రం బ్యాట్ ( Bat ) బాల్ ( Ball )రెండింటిని పెట్టి ఇప్పటికి పూజిస్తున్నారని తెలుస్తోంది.ఈ విధంగా ఈయన తన దేవుడు గదిలో దేవుడితో సమానంగా తన బ్యాట్ బాల్ పూజించడంతో ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు సచిన్ తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.సచిన్ టెండూల్కర్ కుమారుడు కూడా క్రికెట్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.