ఎన్నికల ప్రచారంలో భాగంగా భైంసాలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలు రాగానే కానిపోని మాటలు చెప్తారన్న కేసీఆర్ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా ప్రజల్లో మార్పు రాలేదన్నారు.ప్రతిపక్షాల మాయలో ప్రజలు పడొద్దని సూచించారు.
ఓటును విచక్షణాజ్ఞానంతో వేయాలన్నారు.ఓటు వజ్రాయుధం అన్న కేసీఆర్ సరైన వ్యక్తికి ఓటు వేస్తేనే భవిష్యత్ బాగుంటుందని తెలిపారు.
అలా కాకుండా ఎవరికి పడితే వారికి ఓటేస్తే తరువాత బాధపడతారని పేర్కొన్నారు.రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారన్న కేసీఆర్ రైతుబంధు ఉండాలా? వద్దా? అనేది ప్రజలే ఆలోచించుకోవాలని తెలిపారు.ధరణి పోర్టల్ తీసేస్తే మళ్లీ పైరవీకారులు, దళారుల రాజ్యం వస్తుందని వెల్లడించారు.