మెగాస్టార్ చిరంజీవితో తాను నటించేందుకు రెడీ అంటుంది రోజా.సినిమాల కన్నా రాజకీయాలపై పూర్తి ఫోకస్ పెట్టిన రోజా మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే స్పెషల్ గా ఏర్పాటు చేసిన వీడియో చిట్ చాట్ లో ఆమె పాల్గొన్నారు.
ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవితో ఆమె పనిచేసిన విషయాలను గుర్తు చేసుకున్నారు.ముఠామేస్త్రి సినిమాతో చిరంజీవికి జోడీగా నటించిన రోజా ఆ తర్వాత ముగ్గురు మొనగాళ్లు, బిగ్ బాస్ సినిమాల్లో కూడా చిరు సరసన నాటించింది.
ఇక పొలిటికల్ గా బిజీ అయ్యాక సినిమాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించని రోజా మంచి అవకాశం వస్తే చేస్తానని అంటుంది.ఇక చిరు బర్త్ డే స్పెషల్ చిట్ చాట్ లో భాగంగా చిరంజీవితో నటించడానికి తాను రెడీ అంటూ చెబుతుంది రోజ.ఆమెకి తగిన పాత్ర వస్తే తప్పకుండా రోజాకి చిరు ఛాన్స్ ఇవ్వడంలో వెనకాడరు.చిరంజీవి గారు తనని బాగా ఎంకరేజ్ చేశారని మెగాస్టార్ తో తన అనుభవాలను ప్రస్థావించారు రోజా సెల్వమణి.
సినిమాలు చేయకపోయినా రోజా జబర్దస్త్ షోతో ఆడియెన్స్ కు టచ్ లో ఉంటుంది.కామెడీ షోలో రోజా జడ్జ్ మెంట్ కు ఆడియెన్స్ ఎంటర్టైన్ అవుతున్నారు.