ఇషాన్ కిషన్ కోసం ఆ నిర్ణయం తీసుకున్న రోహిత్ శర్మ.. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ..!

తాజాగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో వెస్టిండీస్( West Indies ) జట్టుపై చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని భారత జట్టు సొంతం చేసుకుంది.భారత జట్టు అటు బౌలింగ్లో, ఇటు బ్యాటింగ్లో చెలరేగి విండీస్ పై ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.

 Rohit Sharma Who Took That Decision For Ishan Kishan.. Speaking After The Match-TeluguStop.com

మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో అన్ని వికెట్లు కోల్పోయి కేవలం 150 పరుగులు చేసింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు లో యశస్వి జైస్వాల్ 171, కెప్టెన్ రోహిత్ శర్మ 103, విరాట్ కోహ్లీ 76 కీలక ఇన్నింగ్స్ ఆడారు.

బౌలింగ్లో భారత జట్టు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీశాడు.రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు 130 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది.

అశ్విన్ రెండో ఇన్నింగ్స్ లో 7 వికెట్లు తీసి మూడవ రోజే మ్యాచ్ ముగించాడు.

Telugu Ishan Kishan, Latest Telugu, Rohit Sharma, Kohli-Sports News క్రీ

మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.టెస్టు క్రికెట్ లోకి ఆరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్( Yashasvi Jaiswal ) ఎప్పటినుంచో జట్టు కోసం సిద్ధమవుతున్నాడని, అతనిలో మంచి ప్రతిభ ఉందని ప్రశంసలతో కొనియాడాడు.తొలి టెస్ట్ లోనే తనకు వచ్చిన అవకాశాన్ని చాలా అద్భుతంగా ఉపయోగించుకున్నాడు అని తెలిపాడు.టీ20 లో ప్రదర్శించిన దూకుడును టెస్టు మ్యాచ్లో ప్రదర్శించకుండా, అసలు ఎటువంటి కంగారు అనేదే లేకుండా చక్కగా క్రిజూ లో నిలబడి అదరగొట్టాడని తెలిపాడు.అంతేకాకుండా తాను కంగారు పడకుండా మ్యాచ్ ను ఆస్వాదించి ఆడితే పరుగులు వస్తాయని సలహా ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు.

Telugu Ishan Kishan, Latest Telugu, Rohit Sharma, Kohli-Sports News క్రీ

ఇక ఇన్నింగ్స్ డిక్లేర్ అనేది విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత చేద్దామని ముందుగానే అనుకున్నట్లు తెలిపాడు.కాకపోతే ఇషాన్ కిషన్( Ishan Kishan ) కు కూడా ఇదే తొలి టెస్ట్ మ్యాచ్.ఇషాన్ కిషన్ కి కూడా తొలి టెస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ చేయాలి అనే ఆత్రుత ఉంది.అందుకే అతను సింగిల్ తీసిన తర్వాత ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశామని తెలిపాడు.

ఇషాన్ కిషన్ ఒక సింగిల్ తీయడానికి 20 బంతులు ఆడాడు.ఒక సింగల్ తీసిన వెంటనే భారత్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 130 పరుగులకే ఆల్ అవుట్ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube