బుల్లితెర నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ రోహిణి ( Rohini ) బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయం అని చెప్పవచ్చు.ఎందుకంటే రోహిణి మొదట్లో సీరియల్స్ లో నటించింది.
అందులో తను నటించిన కొంచెం ఇష్టం.కొంచెం కష్టం సీరియల్ తో మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఆ సీరియల్ లో తన పాత్రతో బాగా నవ్వించింది రోహిణి.దీంతో అప్పటి నుంచి రోహిణి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.
ఆ తర్వాత పలు సీరియల్ లలో అవకాశాలు కూడా అందుకుంది.మాటీవీలో శ్రీనివాస కళ్యాణం, ఇన్స్పెక్టర్ కిరణ్ అనే సీరియల్ లో పోలీస్ పాత్రలో నటించింది.సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో రియాలిటీ షో బిగ్ బాస్ లో( Bigg Boss ) అవకాశం అందుకొని అందులో కూడా అడుగు పెట్టింది.కానీ అనుకున్నంత ఫలితం రాకపోగా నాలుగో వారానికి తిరిగి వచ్చేసింది.
బిగ్ బాస్ తర్వాత రోహిణి జబర్దస్త్ లో( Jabardasth ) బాగా బిజీగా మారింది.లేడీ కమెడియన్ గా అడుగుపెట్టి తన కామెడీతో బాగా నవ్విస్తుంది.జబర్దస్త్ లోనే కాకుండా ఇతర షో లలో కూడా బాగా సందడి చేస్తుంది.వెండితెరపై కూడా పలు సినిమాలలో సైడ్ ఆర్టిస్టుగా అవకాశాలు అందుకుంది.కానీ తనకు బుల్లితెరపై మాత్రమే మంచి క్రేజ్ వచ్చింది.
ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండటంతో ఎప్పటికప్పుడు తన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.
అలా సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ సంపాదించుకుంది.యూట్యూబ్ లో కూడా తనకంటూ ఒక ఛానల్ క్రియేట్ చేసుకుని అందులో బాగా సందడి చేస్తుంది.చేసే ప్రతి అనిని వీడియో తీస్తూ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంది.ఆ ఛానల్ కి ఫాలోవర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు.
ఇక ఈమధ్య రోహిణి కాస్త అందాన్ని కూడా పెంచింది.ఒకప్పుడు లావుగా కనిపించిన రోహిణి ఇప్పుడు కాస్త బరువు తగ్గించి అందంగా రెడీ అవుతూ అందరి దృష్టిలో పడుతూ ఉంటుంది.అయితే తాజాగా ఆమె కూడా అందరిలాగా అవకాశాలు కోసం మంచి ఫిజిక్ సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.తాజాగా ఆమె తన సోషల్ మీడియా వేదికగా ఒక స్టోరీ పంచుకుంది.
ఆ స్టోరీలో తను జిమ్ములో ట్రైనర్ ఆధ్వర్యంలో వర్క్ అవుట్ చేస్తున్నట్లు కనిపించింది.ఇక ఆ స్టోరీ ప్రస్తుతం వైరల్ అవ్వగా.అది చూసి జనాలు ఈమె కూడా అవకాశాల కోసం కొత్త దారి పట్టుకుందని కామెంట్లు పెడుతున్నారు.ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే రీసెంట్గా విడుదలైన బలగం సినిమాలో( Balagam Movie ) తన పాత్రతో అందరినీ భలే నవ్వించింది.
ఇక పలు సినిమాలలో కూడా అవకాశాలు అందుకున్నట్లు తెలిసింది.మరోవైపు బుల్లితెరపై యధావిధిగా షోలల్లో పాల్గొని బాగా సందడి చేస్తుంది.