తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో ప్రధాన పార్టీల నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఇదే సమయంలో ప్రజలకు హామీలు ఇస్తూ మరోపక్క ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ ఉన్నారు.
కాగా ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని తెలంగాణ కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉంది.దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన జాతీయ నాయకులు భారీ ఎత్తున తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భారీగా కష్టపడుతున్నారు.ఇదే సమయంలో ప్రత్యర్థులపై తనదైన శైలిలో మండిపడుతున్నారు.
ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారు.తాజాగా ట్విట్టర్ లో గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలలో 80% పూర్తి చేయలేదని అందుకే ఆ పార్టీకి పాలించే హక్కు లేదని రేవంత్ రెడ్డి సీరియస్ పోస్ట్ పెట్టారు.‘అబద్ధాలే మీ ఆయుధాలు, వంచనలే మీ సిద్ధాంతాలు.నాటకాలే మీకు తెలిసిన విద్యలు.మీరు ఇచ్చి తప్పిన హామీలకు లెక్కలేదు.మీకింకా పాలించే హక్కు లేదు.
ఈ గడ్డ మరువదు మీరు పెట్టిన గోస.మీపై లేనే లేదు భరోసా.ముక్కు నేలకు రాసినా.పొర్లి పొర్లి దండాలు పెట్టినా.పారవు మీ పాచికలు.తప్పవు మీకు శంకరగిరి మాన్యాలు’ అని రేవంత్ ట్వీట్ చేశారు.