కోదండరామ్ కు రేవంత్ ప్రయార్టీ ! ఆ రెండు పదవుల్లో ఒకటి ఖాయం 

తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )బాధ్యతలు స్వీకరించారు.

 Revanth Priority To Kodandaram One Of Those Two Positions Is Certain , Telanga-TeluguStop.com

ఎన్నికల సమయంలో వివిధ పార్టీల మద్దతు కాంగ్రెస్ తీసుకుంది.కొన్ని పార్టీలకు పొత్తులో భాగంగా సీట్లు కేటాయించగా, మరికొన్ని పార్టీలకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తగిన ప్రాధాన్యం ఇస్తామని ఒప్పించారు.

ముఖ్యంగా ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపించారు.దీనిలో భాగంగానే తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాముతోను ఇదే విధంగా మంతనాలు చేసి రేవంత్ ఒప్పించారు.

ఫలితంగా సీట్లు కేటాయించకుండా, అనుకున్నట్లుగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

Telugu Aicc, Kodandaram, Pcc, Revanth Reddy, Telanganacm, Telangana-Politics

 దీంతో కోదండరాం ( Kodandaram )కు ఏ పదవి ఇవ్వబోతున్నారు ? ఆయనకు ఏ స్థాయిలో ప్రాధాన్యం దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది .అయితే ఇప్పుడిప్పుడే తన సొంత టీంను ఏర్పాటు చేసుకుంటున్న రేవంత్ రెడ్డి ఇప్పటికే ఇంటెలిజెన్స్ చీఫ్ గా శివధర్ రెడ్డిని నియమించారు.సీఎంవో ముఖ్య కార్యదర్శి నియామకాలు కూడా పూర్తి చేశారు .ఇక కొత్త ప్రభుత్వంలో ప్రొఫెసర్ కోదండరాంకు కీలక పదవిని ఇచ్చేందుకు రేవంత్ సిద్ధమవుతున్నారట .ఈ మేరకు ఆయనకు ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.పరిపాలనలో కోదండరాం సలహాలు, సహకారం తీసుకోవాలని రేవంత్ భావిస్తున్నారట.తెలంగాణ  వనరులు, విద్య ,తెలంగాణకు అనుకూలమైన పరిపాలన వంటి రంగాల్లో కోదండరాంకు అపారమైన అనుభవం,  పరిజ్ఞానం ఉండడంతో అటువంటి వ్యక్తిని సలహాదారుగా నియమిస్తే తనకు అన్ని విధాలుగా కలిసి వస్తుందని రేవంత్ భావిస్తున్నారట.

Telugu Aicc, Kodandaram, Pcc, Revanth Reddy, Telanganacm, Telangana-Politics

 అలాగే ఉద్యోగ నియామకాల్లో కీలకం అయిన టీఎస్పీఎస్సీ చైర్మన్ గా కూడా కోదండరాము నియమించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది .ఇదే కాకుండా ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ పై అనేక ఆరోపణలు వచ్చాయి.పేపర్ లీకేజీ ఘటనతో టీఎస్పీఎస్సీ ప్రతిస్ట మసక బారింది.ఈ నేపథ్యంలో కోదండరాంకు ఆ బాధ్యతలు అప్పగిస్తే నిరుద్యోగులలోను నమ్మకం ఏర్పడుతుందని రేవంత్ ( CM Revanth Reddy )భావిస్తున్నారట.

ప్రభుత్వ సలహాదారు, లేదంటే టీఎస్పీఎస్సీ చైర్మన్ గా కోదండరాంకు ఏదో ఒక పదవి దక్కే అవకాశం ఉన్నట్లు రేవంత్ సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube