ఎన్నికల తర్వాత కూడా ఈ గొడవేంటి!  

ఎన్నికల ఫలితాలపై టెన్షన్ పడుతున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు. .

Reason Behinds Tdp And Ysrcp Comments After Elections-janasena,reason Behinds,tdp And Ysrcp

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిపోయాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో పోలింగ్ లో పాల్గొని తమ తీర్పుని చెప్పేశారు.అయితే ఆ తీర్పు ఫలితం ఎలా ఉంటుంది..

ఎన్నికల తర్వాత కూడా ఈ గొడవేంటి! -Reason Behinds TDP And YSRCP Comments After Elections

ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది అనే విషయాలపై పూర్తిగా తెలియడానికి మరో నెల రోజులు వేచి చూడాలి. అయితే ఈ లోపే మళ్ళీ ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఓ వైపు తామే మళ్ళీ అధికారంలోకి వస్తామంటే, తామే వస్తాం అంటూ కబుర్లు చెబుతూనే మరో వైపు ఏపీలో ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించింది అని, అలాగే ఎక్కడికక్కడ వైసీపీ రిగ్గింగ్ లకి పాల్పడిందని టీడీపీ అధినేత ఆరోపణలు చేస్తున్నారు.

మరో వైపు వైసీపీ పార్టీ నేతలు కూడా మేము ఏ మాత్రం తక్కువ కాదు అన్నట్లు టీడీపీపై విమర్శల దాడి చేస్తున్నారు.

టీడీపీ ప్రభుత్వం పోలీసులని అడ్డుపెట్టుకొని వైసీపీ కార్యకర్తలు పోలింగ్ కి రాకుండా అడ్డుపడ్డారని, అలాగే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేసారని ఆరోపణలు చేస్తూ ఈవీఎం ఓటింగ్ యంత్రాలకి ఏపీ పోలీసుల సెక్యూరిటీ మీద తమకి నమ్మకం లేదని కేంద్ర బలగాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తుంది.

మొత్తానికి ఓ వైపు గెలుపు అంటూనే మరో వైపు గెలుపుపై రెండు పార్టీలు టెన్సన్ లో ఉన్నట్లు వారి పద్దతుల బట్టి తెలుస్తుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి రెండు పార్టీలు ఇంతగా ఎలక్షన్ తర్వాత కూడా రిజల్ట్ వరకు వేచి చూడకుండా టెన్షన్ పడటం లో అర్ధం ఏంటి అనేది వారికే తెలియాలి.