Rashmika Mandanna : అవన్నీ ఉంటే ఈ ప్రపంచాన్ని మరోలా చూడొచ్చు.. రష్మిక పోస్టు వైరల్!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నేషనల్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) ఒకరు.హీరోయిన్ గా ఈమె కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు.

 Rashmika Mandanna Latest News Viral On Social Media-TeluguStop.com

అయితే కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రష్మిక అనంతరం తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చారు.తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమెకు పుష్ప సినిమాలో( Pushpa ) అవకాశం వచ్చింది.

ఈ సినిమా ద్వారా ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందారు.

ఈ సినిమా అనంతరం రష్మిక వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నారు.

భాషతో సంబంధం లేకుండా తెలుగు తమిళ హిందీ భాష చిత్రాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇటీవల రష్మిక యానిమల్ సినిమా( Animal Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమెకు ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

Telugu Pushpa, Happiness, Tollywood-Movie

ప్రస్తుతం రష్మిక పుష్ప 2( Pushpa 2 ) సినిమా షూటింగ్ పనులతో పాటు ఇతర సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు.ఇలా ఒకవైపు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.ఇకపోతే రష్మిక తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Telugu Pushpa, Happiness, Tollywood-Movie

ఇందులో భాగంగా ఈమె మనకు నిజమైన సంతోషం( Real Happiness ) ఎప్పుడూ కలుగుతుంది అంటే దృఢమైన శరీరం ప్రశాంతమైనటువంటి మెదడు, ఇల్లు మొత్తం ప్రేమతో నిండి ఉండటం.ఈ వస్తువులను మనం ఎప్పటికీ కొనలేము కానీ వీటిని మనం సంపాదించుకోవాలి.ఇలా ఉన్నటువంటి ఒక కొటేషన్ ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఇలా ఈ కొటేషన్ ను రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.ఇవన్నీ కనుక మీకు ఉన్నట్టయితే ఈ ప్రపంచం మీకు కొత్తగా కనపడుతుంది అంటూ కామెంట్స్ చేశారు.

Telugu Pushpa, Happiness, Tollywood-Movie

ఇలా రష్మిక చేసినటువంటి ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక రష్మిక ఇటీవల సోషల్ మీడియాలో తనకు కాబోయే భర్త VD అవ్వాలని వీడి అంటే వెరీ డేరింగ్ అనే పోస్ట్ కు అవును ఇది వాస్తవమే అంటూ రిప్లై ఇవ్వడంతో మరోసారి విజయ్ దేవరకొండతో( Vijay Devarakonda ) డేటింగ్ రూమర్లు తెరపైకి రావడమే కాకుండా రష్మిక పరోక్షంగా తనకు కాబోయే భర్త విజయ్ దేవరకొండ అంటూ సమాధానం చెప్పారు అంటూ ఈ పోస్టును కూడా వైరల్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube