తండాలకు వేయలేని రోడ్లు ఫామౌస్ వేసుకుండ్రు:ఎమ్మేల్యే రాజ్ గోపాల్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా: సంతు సేవాలాల్ సిద్ధాంతాలు చాలా గొప్పవని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సంత్ సేవాలాల్ 285వ జయంతి ఉత్సవాలను శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ గిరిజనులు సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉండాలని ఆశించిన వ్యక్తి సేవలాల్ అని,ఆయన బాటలోనే నేను కూడా ప్రయాణిస్తున్నానని, తండాలలో మద్యపాన నిషేధాన్ని బెల్టు దుకాణాల బందుకు కట్టుబడి ఉండాలని గిరిజనులకు సూచించారు.

 Roads That Cannot Be Laid To Thandas Famous Vesukundru Mla Raj Gopal Reddy , Mla-TeluguStop.com

గతంలో ఉన్న ప్రభుత్వం భవనాల ప్రకటనలో కాలయాపన చేశాయని,నిర్మాణాలు జరగలేదని,గిరిజనుల అభివృద్ధికి రోడ్లు వేయకుండా ఫామ్ హౌస్ లకు రోడ్లు వేసుకున్నారని విమర్శించారు.వచ్చే సంవత్సరం నియోజకవర్గ స్థాయి సేవాలాల్ జయంతి ఉత్సవాలను నూతన సేవాలాల్ భవనంలో నిర్వహించుకుందామని తెలిపారు.

ఈకార్యక్రమంలో మండల ఎంపీపీ, ఎమ్మార్వో,ఎంపీడీవో,ఆల్ ఇండియా బంజారా సంఘం నాయకులు, మండల గిరిజనులు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube