సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ఊహించని విధంగా ఎన్నో అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకొని పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్న నటి రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం ఈమె వరస సినిమాలతో వివిధ భాషలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఈ క్రమంలోనే రష్మిక తాజాగా సీతారామం సినిమాలో ఆఫ్రిన్ అనే ముస్లిం యువతి పాత్రలో నటించారు.ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సినిమాలో ఆఫ్రీన్ అనే యువతి పాత్ర ఎంతో వైలెంట్ గా ఉంటుందని.ఈ సినిమాని తను చాలెంజ్ గా తీసుకొని చేశానంటూ రష్మిక తెలిపారు.ఇప్పటివరకు తన జీవితంలో ఇలాంటి వైవిధ్యమైన పాత్రలు చేయలేదని ఈ పాత్ర తన జీవితంలో బాగా గుర్తుండిపోయే వాటిలో ఒకటి అవుతుందంటూ ఈమె తెలిపారు.ఇకపోతే ప్రస్తుతం తాను నటించే సినిమాలలో తన పరిధి దాటి నటిస్తున్నానని,ఇప్పుడే ఆట మొదలైంది అంటూ రష్మిక ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సీతారామం సినిమాలో తనకు అలాంటి పాత్ర ఇచ్చినందుకు డైరెక్టర్ హను రాఘవపుడికి కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా ఆయన తన కెరియర్ లో మరిన్ని విజయాలు అందుకోవాలని ఈమె కోరుకున్నారు.ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె మూడు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండడమే కాకుండా, తెలుగు తమిళ సినిమాలతో కూడా బిజీగా గడుపుతున్నారు.ఇకపోతే త్వరలోనే పుష్ప 2 సినిమా షూటింగ్ తో కూడా ఈమె బిజీ కానున్నారు.