టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నటువంటి విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) రష్మిక మందన్న( Rakshmika Mandanna ) జంటకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి వీరిద్దరూ కలిసి రెండు సినిమాలలో నటించారు.అయితే ఈ సినిమాలో వీరిద్దరి మధ్య అద్భుతమైనటువంటి కెమిస్ట్రీ వర్కౌట్ కావడంతో నిజజీవితంలో కూడా వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలకు అనుగుణంగానే విజయ్ దేవరకొండ రష్మిక వ్యవహార శైలి కూడా ఉండడంతో ఈ వార్తలు రోజు రోజుకి బలపడుతున్నాయి.
రష్మిక విజయ్ దేవరకొండ ఇద్దరు కలిసి వెకేషన్ లకు వెళ్లడం అలాగే తన ఇంట్లో ఫంక్షన్లకు రష్మిక హాజరు కావడం ఇక విజయ్ దేవరకొండ తల్లిని తన సెకండ్ మదర్ అని ఈమె సంబోధించడం వంటివి చూస్తూ ఉంటే కనుక వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, రష్మిక దేవరకొండ కోడలిగా ఫిక్స్ అయ్యారు అంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.ఇలా వీరి రిలేషన్ గురించి తరచు వార్తలు వస్తున్న వారి మధ్య ఏమీ లేదు అంటూ చెప్పుకొస్తున్నారు తప్ప క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు ఇలా ఇప్పటికే ఎన్నోసార్లు ప్రేక్షకులకు, అభిమానులకు అడ్డంగా దొరికిపోయినటువంటి ఈ జంట తాజాగా మరోసారి దొరికిపోయారు.దీంతో వీరిద్దరూ పక్కా రిలేషన్ లో ఉన్నారని ఏ క్షణమైనా ఈ విషయాన్ని ప్రకటించవచ్చు అని కూడా భావిస్తున్నారు.
విజయ్ దేవరకొండ రౌడీ వేర్( Rowdy wear ) అనే బ్రాండ్ తో క్లాత్ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే ఈయన రౌడీ బ్రాండ్ అనే క్లాత్ కాకుండా సరికొత్త బ్రాండ్ ద్వారా తమ ప్రొడక్ట్స్ అందుబాటులోకి తీసుకురాబోతున్నామని ప్రకటించారు అయితే ఈ కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేయడానికి ముందే రష్మిక విజయ్ దేవరకొండ ఈ బ్రాండెడ్ దుస్తులతో కనిపించడంతో మరోసారి వార్తల్లో నిలిచారు.తాజాగా రౌడీ బ్రాండ్ కి చెందిన హుడి వేసుకొని రష్మిక ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో పెద్ద ఎత్తున అక్కడున్నటువంటి వారంతా విజయ్ అంటూ గట్టిగా కేకలు వేశారు .దీంతో ఆమె నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.అయితే తాజాగా ఓటు వేయడానికి విజయ్ దేవరకొండ కూడా అచ్చం అలాంటి డ్రెస్ తో కనిపించడంతో మరోసారి వీరిద్దరూ వార్తల్లో నిలిచారు.ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.