వైరల్ వీడియో: ఇలాంటి జంతువులు కూడా అడవుల్లో ఉంటాయా?

సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.అయితే ఈ రకానికి చెందిన అరుదైన జంతువుకు సంబంధించిన వీడియో బహుశా మీరు ఇంతకు మునుపు చూసి వుండరు.

 Rare Himalayan Lynx Animal Found In Laddakh Region Video Viral Details, Viral Vi-TeluguStop.com

అవును, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ప్రస్తుత వీడియోని చూసి నెటిజన్లు తమ కళ్ళను తామే నమ్మలేకపోతున్నారు.చూడడానికి అది ఓ పెద్ద బలంగా బలిసిన పిల్లిలాగా కనబడుతుంది గాని, సరిగ్గా తరచి చూస్తే దాని ఆకారం, కొమ్ముల్లాంటి చెవులు ఉండడం మీరు గమనించవచ్చు.

దాంతో ఈ వింత జంతువు చాలా ప్రత్యేకతని సంతరించుకుంది.కొంతమంది అది చాలా ఫన్నీగా ఉందని అంటే, మరికొంతమంది అది చాలా భయానకంగా ఉందని, కొందరు చాలా చిత్ర విచిత్రంగా ఉండాలి అంటున్నారు.కాగా ఈ జంతువును లడఖ్ ప్రాంతంలో గుర్తించినట్టు తెలుస్తోంది.ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ ఆ జంతువుకు సంబంధించిన వీడియోను ట్వి్ట్టర్ లో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.

ఈ జంతువును “హిమాలయన్ లింక్స్” అని పిలుస్తారట.ఇప్పటివరకు ఇలాంటి జంతువును భారత్ లో చూడలేదని, మొదటిసారి ఇక్కడ గుర్తించినట్లు అతగాడు తెలిపాడు.

ఇకపోతే హిమాలయన్ లింక్స్ జంతువులు ఓ రకమైన అడవి పిల్లుల జాతికి చెందినవట.ఇలాంటి జంతువులు ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా అడవుల్లో ఎక్కువగా నివసిస్తాయని అంటున్నారు.కాగా ఈ జాతుల్లో మొత్తం నాలుగైదు రకాలుంటాయి.వాటిని యురేషియన్, ఐబీరియన్, కాండా లింక్స్ మరియు బాబ్‌క్యాట్స్ (లింక్స్ రూఫస్) అని పిలుస్తారు.ప్రవీణ్ కశ్వాన్ దాన్ని పోస్ట్ చేస్తూ… “భారత్ లో ఓ అందమైన, అరుదైన జంతువు లడఖ్ రీజియన్ లో దర్శనం ఇచ్చింది… చాలా మంది దీని గురించి విని ఉండరు.ఊహించండి? ఇది ఏమిటో?” అంటూ సవాలు విసిరారు.అయితే చాలామంది ఆ జంతువు ఏమిటన్న విషయం మాత్రం చెప్పలేకపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube