వైరల్ వీడియో: ఇలాంటి జంతువులు కూడా అడవుల్లో ఉంటాయా?

సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.అయితే ఈ రకానికి చెందిన అరుదైన జంతువుకు సంబంధించిన వీడియో బహుశా మీరు ఇంతకు మునుపు చూసి వుండరు.

అవును, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ప్రస్తుత వీడియోని చూసి నెటిజన్లు తమ కళ్ళను తామే నమ్మలేకపోతున్నారు.

చూడడానికి అది ఓ పెద్ద బలంగా బలిసిన పిల్లిలాగా కనబడుతుంది గాని, సరిగ్గా తరచి చూస్తే దాని ఆకారం, కొమ్ముల్లాంటి చెవులు ఉండడం మీరు గమనించవచ్చు.

"""/" / దాంతో ఈ వింత జంతువు చాలా ప్రత్యేకతని సంతరించుకుంది.కొంతమంది అది చాలా ఫన్నీగా ఉందని అంటే, మరికొంతమంది అది చాలా భయానకంగా ఉందని, కొందరు చాలా చిత్ర విచిత్రంగా ఉండాలి అంటున్నారు.

కాగా ఈ జంతువును లడఖ్ ప్రాంతంలో గుర్తించినట్టు తెలుస్తోంది.ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ ఆ జంతువుకు సంబంధించిన వీడియోను ట్వి్ట్టర్ లో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.

ఈ జంతువును "హిమాలయన్ లింక్స్" అని పిలుస్తారట.ఇప్పటివరకు ఇలాంటి జంతువును భారత్ లో చూడలేదని, మొదటిసారి ఇక్కడ గుర్తించినట్లు అతగాడు తెలిపాడు.

"""/" / ఇకపోతే హిమాలయన్ లింక్స్ జంతువులు ఓ రకమైన అడవి పిల్లుల జాతికి చెందినవట.

ఇలాంటి జంతువులు ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా అడవుల్లో ఎక్కువగా నివసిస్తాయని అంటున్నారు.

కాగా ఈ జాతుల్లో మొత్తం నాలుగైదు రకాలుంటాయి.వాటిని యురేషియన్, ఐబీరియన్, కాండా లింక్స్ మరియు బాబ్‌క్యాట్స్ (లింక్స్ రూఫస్) అని పిలుస్తారు.

ప్రవీణ్ కశ్వాన్ దాన్ని పోస్ట్ చేస్తూ."భారత్ లో ఓ అందమైన, అరుదైన జంతువు లడఖ్ రీజియన్ లో దర్శనం ఇచ్చింది.

చాలా మంది దీని గురించి విని ఉండరు.ఊహించండి? ఇది ఏమిటో?" అంటూ సవాలు విసిరారు.

అయితే చాలామంది ఆ జంతువు ఏమిటన్న విషయం మాత్రం చెప్పలేకపోయారు.

వారి అండతో దుబాయిలో దాక్కున్న హర్ష సాయి..?