మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) హీరోగా, శంకర్( Shankar ) దర్శకత్వంలో గేమ్ ఛేంజర్( game changer ) చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు( నిర్మిస్తున్నాడు.
సాధారణంగా దిల్ రాజు ఏ సినిమా ను నిర్మించిన కూడా బడ్జెట్ విషయంలో పక్కా ప్లానింగ్ తో ఉంటాడు అనే విషయం తెలిసిందే.ఆయన సినిమాల్లో ఒకటి రెండు మినహా దాదాపు అన్ని సినిమాలు కూడా బడ్జెట్లోనే పూర్తయ్యాయి.
కాని శంకర్ రూపొందిస్తున్న ఈ గేమ్ ఛేంజర్ సినిమా మాత్రం బడ్జెట్ విషయం లో శృతి మించుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే అనుకున్న బడ్జెట్ ని పూర్తి చేశారట.
అయినా కూడా సినిమా 50 రోజుల షూటింగ్ పెండింగ్ లో ఉంది.ప్రస్తుతం 1000 మంది తో ఒక యాక్షన్స్ సన్నివేశాన్ని రూపొందించేందుకు దర్శకుడు శంకర్ ఏర్పాట్లు చేస్తున్నాడు.
త్వరలోనే ఆ షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది.చూడబోతుంటే సినిమా మేకింగ్ కోసం ఇంకా 50 కోట్ల రూపాయల ఖర్చు అయ్యే అవకాశం ఉంది.
సినిమా బడ్జెట్ ముందుగా అనుకున్న దానితో పోలిస్తే దాదాపు 100 కోట్ల రూపాయలు అదనంగా అవ్వబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.ఈ అదనపు బడ్జెట్ భారం ఎవరి పై అనేది తెలియాల్సి ఉంది.రామ్ చరణ్ గత చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఆయన స్థాయిని అమాంతం పెంచిన విషయం తెలిసిందే.అందుకే ఈ సినిమా పై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.
కనుక కాస్త ఎక్కువ బడ్జెట్ పెట్టినా పరవాలేదు అన్నట్లుగా దర్శకుడు శంకర్ మరియు నిర్మాత ఉన్నారని తెలుస్తోంది.ఇదే సమయంలో సినిమా బడ్జెట్ విషయం లో నిర్మాత దిల్ రాజు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు, షికార్లు చేస్తున్నాయి.
అసలు విషయం ఏంటి అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.గేమ్ ఛేంజర్ సినిమా లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
అంజలి కీలక పాత్రలో కనిపించబోతోంది.