టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక ధీరుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో దర్శకుడు రాజమౌళి( Rajamouli ) ఒకరు.ఇప్పటివరకు రాజమౌళి 12 సినిమాలకు దర్శకత్వం వహించారు ఇలా ఈ సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి.
ఇలా రాజమౌళి సినిమాలు అంటేనే ఒక బ్రాండని ఆ సినిమాలకు ఇంటర్నేషనల్ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ లభిస్తుందని చెప్పాలి ఇటీవల ఈయన దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాకు ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.
ఇలా రాజమౌళి సినిమా అంటేనే ఆ సినిమాపై ఎన్నో అంచనాలు ఉంటాయి.
అంతేకాకుండా ఇలాంటి ఒక గొప్ప దర్శకుడు దర్శకత్వంలో సినిమా చేయాలన్న ఆరాటం ప్రతి ఒక్క సెలబ్రిటీలలో కనిపిస్తుంది.ఇక రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలలో విక్రమార్కుడు( Vikramarkudu ) ఒకటి.
రవితేజ( Raviteja ) ద్విపాత్రాభినయంలో నటించినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి ఆదరణ సొంతం చేసుకుంది.ఇప్పటికే ఈ సినిమా టీవీలలో వచ్చిన కల్లా అర్పకుండా చూస్తారు.
ఇక ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలోను అలాగే ఒక దొంగ పాత్రలోను కనిపిస్తారు దొంగ పాత్రలో ఉన్నటువంటి క్యారెక్టర్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుందనే విషయం మనకు తెలిసిందే.అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.ఈ సినిమా చేయడం కోసం రవితేజకు రాజమౌళి పెద్ద ఎత్తున కండిషన్స్( Rajamouli Conditions) పెట్టారట.ఇలా ఈ కండిషన్లకు ఒప్పుకుంటేనే తనతో సినిమా చేస్తానని రాజమౌళి చెప్పారు.
నేను ఈ సినిమా కోసం రాసిన డైలాగ్స్( Dialogues ) అన్నింటిని తూచా తప్పకుండా చెప్పాలి.ఎలాంటి బీప్ సౌండ్ వాడకుండా చెప్పాలని కండిషన్ పెట్టారట.నేనొక స్టార్ హీరోని ఇలాంటి డైలాగ్స్ చెప్పను అనే మాట రాకూడదని స్క్రిప్ట్ ఎలా ఉంటే అలాంటి డైలాగ్స్ అన్నింటిని ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా చెప్పాలి అనే కండిషన్ పెట్టారట.ఇలా చెబితేనే తాను ఈ సినిమాకు ఫైనలైజ్ చేస్తానని రవితేజకు కండిషన్ పెట్టడంతో వెంటనే రవితేజ తనకు కూడా ఇలాంటి స్క్రిప్ట్ కావాలని వెంటనే ఈ సినిమాకు ఒప్పుకున్నారట.
ఇక ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంది ఇందులో రవితేజ సరసన అనుష్క( Anushka ) నటించారు.ఇక ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాలేదు.ఇకపోతే విక్రమార్కుడు సీక్వెల్( Vikramarkudu Sequel ) సినిమా వస్తుంది అంటూ వార్తలు వచ్చాయి కానీ ఇది నిజం కాదంటూ రవితేజ పలు సందర్భాలలో ఖండించారు.