అక్టోబర్ 5న లాక్ చేసిన జక్కన్న..?

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రాజమౌళి రెడీ అవుతున్నాడు.

 Rajamouli Locks October 5 To Resume Rrr Shooting-TeluguStop.com

ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమా షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.అయితే ఆర్ఆర్ఆర్ టీమ్ సభ్యులకు ఇటీవల కరోనా వైరస్ సోకడంతో ఈ సినిమా షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందా అనే సందేహం అందరిలో నెలకొంది.

అయితే ఎవ్వరి ఊహలకు అందకుండా ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు జక్కన్న మాస్టర్ ప్లాన్ వేసినట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.ఈ సినిమా షూటింగ్‌ను అక్టోబర్ 5న తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే తొలుత ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి టీజర్‌ను షూట్ చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట.

మొత్తానికి ఆరు నెలల విరామం తరువాత ఆర్ఆర్ఆర్ టీమ్ తిరిగి షూటింగ్‌ను ప్రారంభిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

పీరియాడికల్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఫారిన్ బ్యూటీ ఒలివియా మారిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతుందో చూడాలి.ఏదేమైనా ఆర్ఆర్ఆర్ షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుండటంతో ప్రేక్షకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తు్న్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube