పెళ్లి చేసుకునే ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పిన లారెన్స్.. అమ్మ పేరుతో కళ్యాణ్ మండపం నిర్మిస్తూ?

టాలీవుడ్, కోలీవుడ్( Tollywood, Kollywood ) ఇండస్ట్రీలలో రాఘవ లారెన్స్ నటుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.లారెన్స్ రెమ్యునరేషన్ కూడా భారీగా ఉండగా తన సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని ఆయన సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారు.

 Raghava Lawrence Kind Heart Details Here Goes Viral In Social Media , Social M-TeluguStop.com

తాజాగా లారెన్స్ భవిష్యత్తులో పెళ్లి చేసుకునే తన ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త చెప్పడం గమనార్హం.

తాజాగా లారెన్స్( Lawrence ) జిగర్ తాండ డబుల్ ఎక్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.

ఈ సినిమా డిసెంబర్ నెల 8వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం అందుతోంది.వేర్వేరు రీజన్ల వల్ల థియేటర్లలో సినిమా చూడటం మిస్సైన వారు ఓటీటీ( OTT ) వేదికగా సినిమాను వీక్షించవచ్చు.

కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్( Directed Karthik Subbaraj ) లో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్ గా నిలిచింది.

Telugu Kollywood, Lawrence, Tollywood-Movie

లారెన్స్ తాజాగా మాట్లాడుతూ జిగర్ తాండ డబుల్ ఎక్స్ మంచి విజయాన్ని అందించిందని అన్నారు.ఈ సినిమాకు అసలైన హీరో కార్తీక్ సుబ్బరాజ్ అని పేర్కొన్నారు.దేవుడి ఆశీస్సులు ఉండటం వల్లే ఈ సినిమా భారీ సక్సెస్ సాధించిందని లారెన్స్ చెప్పుకొచ్చారు.

ఫ్యాన్స్ ప్రోత్సాహాన్ని మరిచిపోలేనని ఫ్యాన్స్ అంతా నా కుటుంబ సభ్యులేనని లారెన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Telugu Kollywood, Lawrence, Tollywood-Movie

అమ్మ పేరుపై కన్మణి కళ్యాణమండపాన్ని( Kanmani Kalyanamandapani ) ఏర్పాటు చేస్తున్నానని ఈ కళ్యాణ్ మండపంలో ఫ్యాన్స్ ఉచితంగా వివాహం చేసుకోవచ్చని లారెన్స్ అన్నారు.ఒక అభిమాని సరైన వసతి లేని ఇంట్లో పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నానని లారెన్స్ అన్నారు.లారెన్స్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఆ మండపంలో వంటపాత్రలతో సహా అన్నీ ఉంటాయని లారెన్స్ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube