2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు( US Presidential Elections 2024 ) సంబంధించి అప్పుడే అమెరికాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ఆశావహులంతా అధ్యక్ష బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్,( President Joe Biden ) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు( Donald Trump ) ఇప్పటికే తాము అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.వీరితో పాటు డెమొక్రాటిక్, రిపబ్లిక్ పార్టీలలో వున్న కొందరు ప్రముఖులు కూడా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా.
ఇంకొందరు కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు.
తాజాగా రిపబ్లికన్ పార్టీలో కీలక నేతగా వున్న, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్( Florida Governor Ron DeSantis ) కూడా అధ్యక్ష బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు.
ఈయన వచ్చే వారం అధికారికంగా రేసులోకి ప్రవేశిస్తారని అమెరికన్ మీడియా తెలిపింది.మే 29న జరిగే దాతల సమావేశానికి అనుగుణంగా అంతకుముందే మే 25న డిసాంటిస్ తన అభ్యర్ధిత్వాన్ని ప్రకటించే అవకాశం వుందని.
ఇందుకోసం అవసరమైన పత్రాలను సిద్ధం చేసే పనిలో ఆయన బిజీగా వున్నారని సమాచారం.
కాగా.రాయిటర్స్-ఇప్సోస్ పోల్ ప్రకారం.2024 రిపబ్లికన్ ప్రైమరీలో యూఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో వున్నారట.అయితే డిసాంటిస్‌కు పార్టీలో వున్న ఆదరణ దృష్ట్యా ట్రంప్‌కు ఆయన గట్టి పోటీ ఇస్తారని విశ్లేషకులు చెబుతున్నారు.అంతేకాకుండా ట్రంప్ నిధుల సేకరణ కార్యక్రమానికి కూడా డిసాంటిస్ ముప్పుగా మారే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
ఇకపోతే రిపబ్లికన్ పార్టీ నుంచి భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ, వివేక్ రామస్వామిలు కూడా 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.ఫిబ్రవరి 14న నిక్కీ, అదే నెల 21న వివేక్‌లు తమ అభ్యర్ధిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు.వీరిద్దరూ అప్పుడే తమ ప్రచారాన్ని కూడా ప్రారంభించారు.ఇప్పుడే ఇలా వుంటే రాబోయే రోజుల్లో ఎంతమంది రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష రేసులో నిలుస్తారో వేచి చూడాలి.