సమంత చీప్ పబ్లిసిటి ట్రిక్స్ చేస్తుంది : నిర్మాత త్రిపురనేని చిట్టి బాబు

శాకుంతలం సినిమా ట్రైలర్ విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది.అయితే ఇక్కడ ఒక విషయం బాగా వైరల్ అవుతుంది.

 Producer Tripuraneni Chitti Babu Fires On Samantha Shaakuntalam Promotions Detai-TeluguStop.com

ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో సమంత కన్నీళ్లు పెట్టుకుంది.ఆ వీడియోస్ సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతున్నాయి.

సోషల్ మీడియా లో సమంత కి వ్యతిరేఖం గా ఒక వర్గం, సపోర్ట్ గా ఒక వర్గం ఎప్పటి నుంచో ఉంది.ఈ ఎమోషనల్ వీడియో బయటకు రాగానే ఆమె ఒక మహా నటి అని, సినిమా ప్రమోషన్ కోసం బాగానే ఏడుస్తుంది అంటూ కామెంట్స్ పెడుతున్న వారు చాలానే ఉన్నారు.

ఇక సమంత ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల అలా కొంచం ఏడ్చి ఉండవచ్చు అని మరికొంత మంది స్పందిస్తున్నారు.అయితే ప్రముఖ ప్రొడ్యూసర్ త్రిపురనేని చిట్టి బాబు మాత్రం సమంత పై విరుచుకపడ్డారు.

ఎవరి కోసం సమంత ఏడుస్తుంది, ఆమె ఏమైనా సంఘ సేవ చేసి కష్టాలు అనువైభవిస్తుందా ? డబ్బులు తీసుకొని సినిమా చేసింది.సినిమా ను ప్రమోట్ చేసుకోవడం వరకు బాగానే ఉంది కానీ, ఇలా ఏడ్చి లేని పోనీ బిల్డప్పులు ఎందుకు ఇవ్వడం అంటూ చిట్టి బాబు ప్రశ్నించారు.

సమంత ఇలా చేయడం ఆమెకు కొత్తేమి కాదు, యశోద సినిమా ప్రమోషన్ కోసం తనకు ఒక వ్యాధి ఉందని బయట పట్టి సోషల్ మీడియా ను షేక్ చేసింది.పైగా తాను వ్యాధి తో బాధ పడుతూ డబ్బింగ్ చెప్తున్నా అంటూ జనాల సానుభూతి కోసం ప్రయత్నిస్తుంది అంటూ వ్యాఖ్యానించారు.సమంతకు వచ్చిన వ్యాధి ప్రాణాంతకమైనది ఏమి కాదు చాల మందికి వచ్చిందే.కేవలం సినిమా ప్రమోషన్ కోసం ఇలా చీప్ పబ్లిసిటీ చేయడం పట్ల జనాలు నవ్వుతున్నారు అంటూ చిట్టి బాబు చెప్పారు.

ట్రైలర్ ఈవెంట్ లో స్టేజి పైన అంతలా బాగా లేనట్టు ఆమె ప్రార్థించడం సబబు కాదు.ఒక వేళా ఆమె ఆరోగ్యం బాగోలేకపోతే ఈవెంట్ కి రాకుండా సినిమా రిలీజ్ కి ప్రమోషన్ కి వచ్చి ఉంటె బాగుండు కదా అన్నారు చిట్టి బాబు.ఇక చిట్టి బాబు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మిడిల్ లో తెగ వైరల్ గా మారాయి.చూడాలి మరి ఈ కన్నీళ్లు సినిమాకు పనికి వస్తాయో రావో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube