స్వరాష్ట్రంలోనే లింగాయత్‌లకు ప్రాధాన్యం :-మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

సమాజంలోని కుల, మత వర్ణ వ్యవస్థను రూపుమాపేందుకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి బసవేశ్వరుడని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.బసవేశ్వరుని జయంతిని పురస్కరించుకొని వీరశైవ లింగాయత్, లింగ బలిజలకు మంత్రి అజయ్ శుభాకాంక్షలు తెలిపారు

 Preference For Lingayats In Swarashtra: -minister Puwada Ajay Kumar-TeluguStop.com

హైదరాబాద్, ట్యాంక్‌బండ్‌పై బసవేశ్వరుడి విగ్రహం ఏర్పాటు, బసవ భవన నిర్మాణానికి ఎకరా స్థలం, రూ.5 కోట్లు నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని మంత్రి అజయ్ గుర్తుచేశారు.అందరూ కలిసి మెలిసి జీవించాలని బసవేశ్వరుడు హితోపదేశం చేశారని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యావత్‌ లింగాయత్‌ జాతి తలెత్తుకొనేలా బసవేశ్వరుడి జయంత్యుత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని ఇది సీఎం కేసీఆర్‌కు లింగాయత్‌ జాతి పట్ల, పేదల పట్ల ఉన్న గౌరవాన్ని ఔదార్యాన్ని చాటిచెప్తున్నదని కొనియాడారు.

నాడు బసవేశ్వరుడు తన ప్రవచనాలతో సనాతన ధర్మాన్ని బోధిస్తే, నేడు సీఎం కేసీఆర్‌ తన పరిపాలనతో సమసమాజ స్థాపన కోసం, సామాజిక తెలంగాణ అభివృద్ధి కోసం చేస్తున్న కృషి వర్ణించలేనిదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube