హైదరాబాద్: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల ప్రచార లోగో ను మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్, డా.వి నరేందర్ రెడ్డి, ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర అధ్యక్ష్యా, కార్యదర్శులు ఆర్.ఎల్.మూర్తి, టి.నాగరాజులు సంయుక్తంగా ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆహ్వాన సంఘం అధ్యక్షుడు డా: వి.నరేందర్ రెడ్డి మాట్లడుతూ ఎస్.ఎఫ్.ఐ.మహాసభలలో విద్యారంగ అభివృద్ధి గురించి చర్చించి ప్రభుత్వానికి సూచనలు చేయాలని కోరారు.ఈ మహాసభలు కరీంనగర్ జిల్లాలో జరపడం అత్యంత ఆనందదాయకంగా ఉందని ఈ మహసభలు జయప్రదం ద్వారా విద్యరంగంలో మంచి మార్పులు జరిగి అందరికి విద్య అందేలాగా నిర్ణయాలు ఉండాలని కోరారు.సమాజంలో విద్యార్ధి సంఘాలు పాత్ర కీలకమైనదని తెలిపారు.
ఈ మహాసభలు విజయవంతం కావాలని కోరారు.
రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఆర్.ఎల్.మూర్తి, టి.నాగరాజులు మాట్లడుతూ.ఎస్.ఎఫ్.ఐ.తెలంగాణ రాష్ట్ర 4వ రాష్ట్ర మహాసభలలో విద్యారంగం సమస్యల పైనా నిర్దిష్టంగా చర్చించి విద్యా రంగ అభివృద్ధి కోసం పోరాటాలు రూపకల్పన చేస్తుందని అందరికీ విద్య – అందరికీ ఉఫాధి కల్పించాలని, దేశంలో, రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితుల పై సమగ్ర మైన చర్చ జరపి పేద విద్యార్ధుల విద్యను అందే భవిష్యత్ పోరాటాలు రూపకల్పన చేయబోతున్నట్లు తెలిపారు.అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కి దూరంగా ఉన్న యూనివర్శీటీలు , ప్రొఫెషనల్ విద్యా అందరికీ అందే విధంగా ప్రభుత్వాలు చర్యలు అంశాలపై కూడా విశాలంగా చర్చ జరిపి పోరాటాలు రూపోందిస్తామన్నారు.
ఎస్.ఎఫ్.ఐ ఏర్పడిన నుండి విద్యారంగ సమస్యల పైన రాజీలేని పోరాటాలు చేస్తుందని అన్నారు.
కరోనా తరువాత విద్యా వ్యవస్థ పూర్తిగా ద్వంసం అయిందన్నారు.
ఎస్.ఎఫ్.ఐ.కరీంనగర్ మహాసభల ద్వారా నూతన పోరాట రూపాన్ని తయారు చేస్తుందని సమరశీల పోరాటాలు రానున్న కాలంలో నిర్ణయించే తీర్మాణాలు చేయనున్నట్లు వారు.తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్శీటీలను వెనక్కి తీసుకోవాలని, వసతిగృహాలు కోసం మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని, పెండింగ్ స్కాలర్ షిప్స్ విడుదల చేయాలని తదితర సమస్యలపై తీర్మాణాలు చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మక్కపెల్లి పూజ, కరీంనగర్ జిల్లా అధ్యక్ష్య, కార్యదర్శులు గజ్జల శ్రీకాంత్, శనిగరపు రజినీకాంత్, జిల్లా కమిటీ నాయకులు రత్నం సురేష్, నాయకులు ప్రవీణ్, సవిత తదితరులు పాల్గొన్నారు.







