పవన్ కళ్యాణ్ ఆస్తులు.. అప్పుల చిట్టా బయటపెట్టిన నాగబాబు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan )నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో పవన్ కి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పవన్ కళ్యాణ్ కేవలం సినీ హీరోగా మాత్రమే కాకుండా జనసేన నాయకుడిగా కూడా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే ఈయన పెద్ద సంవత్సరాల క్రితం జనసేన పార్టీ( Janasena Party )ని స్థాపించి పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు.

 Power Star Pawan Kalyan Net Worth And Properties Details , Pawan Kalyan , Soc-TeluguStop.com

తన పార్టీని ముందుకు నడిపించడం కోసం ఈయన తన ఆస్తులన్నింటినీ కూడా ధారబోసారనే తెలుస్తోంది.సినిమాలలో సంపాదించిన డబ్బులు అన్నీ కూడా పార్టీ కోసమే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

Telugu Janasena, Nagababu, Og, Pawan Kalyan, Tollywood, Ycp-Movie

ఇక నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ఆయన సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంత సంపాదించారు రాజకీయాలలో ఎంత సంపాదించారో తనకు ఎంత మొత్తంలో ఆస్తిపాస్తులు ఉన్నాయి అప్పులు ఎంత ఉన్నాయి అనే విషయాల గురించి గతంలో నాగబాబు( Nagababu )చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా నాగబాబు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సినిమాలలో హీరోగా కొనసాగుతూ కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ స్టార్ హీరోగా సక్సెస్ సాధించారు అయితే స్టార్ హీరోగా కొనసాగిన తనకంటూ ఏమి ఆస్తులు లేవని తెలిపారు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉన్నటువంటి ఇల్లు ఆయన తిరుగుతున్న కార్లు అన్నీ కూడా లోన్ మీదనే ఉన్నాయని తెలిపారు.పవన్ కళ్యాణ్ సినిమాలలో కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకున్నప్పటికీ అవన్నీ కూడా తన జనసేన పార్టీని ముందుకు నడిపించడం కోసమే ఉపయోగిస్తున్నారని నాగబాబు తెలిపారు.

ఇక పవన్ కళ్యాణ్ కు ఏదైనా ఉందా అంటే ఆది శంకరంపల్లిలోనే ఆరు ఎకరాల ఫామ్ హౌస్ మాత్రమే ఉందని అది మాత్రమే పవన్ కళ్యాణ్ ఆస్తి అని మిగిలినవన్నీ లోన్ పైనే ఉన్నాయి అంటూ నాగబాబు తెలిపారు.

Telugu Janasena, Nagababu, Og, Pawan Kalyan, Tollywood, Ycp-Movie

ఇక ఈయన సినిమాలలో నటించి వచ్చిన డబ్బును కూడా పెట్టి ఉంటే ఈపాటికి ఆయన కొన్ని వందల కోట్లకు వారసుడు అయ్యేవారు కానీ పార్టీ కోసం ప్రజల కోసం ఆ డబ్బును ఖర్చు చేశారు ఇక పార్టీ ప్రారంభించిన సమయంలో తన వద్ద డబ్బు లేకపోవడంతో పిల్లల పేరు మీదట ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బులను కూడా ఉపయోగించారని ఈ సందర్భంగా నాగబాబు తెలిపారు.జానీ సినిమా డిజాస్టర్ అయిన తర్వాత బయ్యర్లను ఆదుకోవడానికి తన ఫామ్ హౌస్ కూడా అమ్మేస్తానని పవన్ తెలిపారు.అయితే తాను డబ్బు సంపాదించడం కోసం నువ్వు ఈ ఫామ్ హౌస్ కొనలేదు నువ్వు ఎంతో ఇష్టపడి కొన్నావు దీనిని అమ్మ వద్దు అంటూ తాను చెప్పడంతో రియలైజ్ అయ్యి అదొక్కటే ఉంచుకున్నారని మిగిలిన ఆస్తులన్నీ కూడా అమ్మి ఆ సమయంలో అమ్ముకున్నారని నాగబాబు తెలిపిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube