7547 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి SSC నోటిఫికేషన్..!

ఇంటర్మీడియట్( Intermediate ) పూర్తి చేసి పోలీసు ఉద్యోగం సాధించాలి అనుకునే వారికి SSC భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.ఢిల్లీ పోలీస్ విభాగంలో ఖాళీగా ఉండే కానిస్టేబుల్ పోస్టులను( Constable Jobs ) భర్తీ చేయనుంది.7547 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) ఉద్యోగాల భర్తీకి SSC ఆన్లైన్ ధరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఆసక్తి ఉండే పురుషులు, మహిళలు సెప్టెంబర్ 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.7547 కానిస్టేబుల్ పోస్టులలో పురుషులు: 5056, మహిళలు: 2491 చొప్పున ఉన్నాయి.ఈ పోస్టులకు 10+2 (సీనియర్ సెకండరీ) ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్(LMV) కచ్చితంగా ఉండాలి.

 7547 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ�-TeluguStop.com
Telugu Delhi, Jobs, Ssc Jobs, Ssc, Ssc Latest-Jobs

ఎంపిక విధానం:

దేహదారుద్య పరీక్షలు (పీఈటీ/పీఎంటీ), వైద్య పరీక్షలు, కంప్యూటర్ ఆధారిత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.కంప్యూటర్ ఆధారిత పరీక్ష( CBT ) డిసెంబర్ లో నిర్వహించే అవకాశం ఉంది.ఈ పరీక్ష 100 మార్కులకు ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది.ఇందులో రీజనింగ్( Reasoning ) 25 ప్రశ్నలకు 25 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 15 ప్రశ్నలకు 15 మార్కులు, కంప్యూటర్ ఫండమెంటల్, ఎమ్మెస్ ఆఫీస్, ఇంటర్నెట్, వెబ్ బ్రౌజర్ లకు సంబంధించి పది ప్రశ్నలకు పది మార్కులు.

జీకే,( GK ) కరెంట్ అఫైర్స్( Current Affairs ) 50 ప్రశ్నలకు 50 మార్కుల చొప్పున ఉంటాయి.ఈ వంద మార్కులకు నిర్వహించే పరీక్ష 90 నిమిషాల పాటు జరగనుంది.

Telugu Delhi, Jobs, Ssc Jobs, Ssc, Ssc Latest-Jobs

ఈ పరీక్ష ఇంగ్లీష్, హిందీలో మాత్రమే నిర్వహిస్తారు.ఇందులో నెగటివ్ మార్క్స్( Negative Marks ) కూడా ఉంటాయి.ఒక్కో తప్పు సమాధానం కి 0.25 మార్క్ చొప్పున కోత ఉంటుంది.మన తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, విజయనగరం, తిరుపతి, రాజమండ్రి, నెల్లూరు, కర్నూలు, కాకినాడ, గుంటూరు, చీరాల, కరీంనగర్, వరంగల్ కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తారు.దరఖాస్తు ఫీజు రూ.100. (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ, ఎక్స్- సర్వీస్ మెన్ అభ్యర్థులకు మినహావింపు).

వేతనం:

పే లెవెల్-3( రూ.21700- రూ.69100)

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube