తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.ముఖ్యంగా ఏపీలో ఈ పండుగా సందడి అంతా ఇంతా కాదు.
ప్రజలంతా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఉంటే.ఏపీలోని రాజకీయ పార్టీలు( Political parties ) మాత్రం పొలిటికల్ సంక్రాంతిలో బిజీబిజీగా ఉన్నాయి.
ఈ సంక్రాంతి తరువాత నుంచి పూర్తిస్థాయిలో జనాల్లో ఉండే విధంగా అన్ని పార్టీలు యాక్షన్ సిద్ధం చేసుకుంటున్నారు.ఎన్నికలకు సమయం దగ్గరపడిన నేపథ్యంలో మరింత స్పీడ్ పెంచేందుకు నిర్ణయించుకున్నాయి.
నాయకులు, ప్రజలు ప్రస్తుతం సంక్రాంతి పండుగ హడావుడి లో ఉండడంతో, ఈ పండుగ తరువాత అన్ని కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
పండుగ తర్వాత ఈనెల 25 వ తేదీ టార్గెట్ గా పెట్టుకుంది.ఇప్పటికి మూడు విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వైసిపి( ycp ) నాలుగో విడత జాబితాను విడుదల చేసేందుకు సిద్ధం అవుతోంది.సంక్రాంతి తర్వాత ఫైనల్ లిస్టును ప్రకటించనుంది.ఈనెల 25 నుంచి జగన్ జిల్లాలో పర్యటన చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.26 జిల్లాల్లో పార్టీ యంత్రాన్ని ఎన్నికలకు సన్నద్ధం చేసే విధంగా జగన్( jagan ) ప్రత్యేక కార్యచరణను రూపొందించుకున్నారు.ఈనెల 25 నుంచి రీజినల్ క్యాడర్ సమావేశాలు మొదలుకానున్నాయి.తొలి సమావేశానికి పార్టీ కీలక నాయకులంతా హాజరుకానున్నారు.ఆ తరువాత 4 నుంచి 6 జిల్లాల కేడర్ తో ఒక సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సందర్భంగా ఈ సమావేశాల్లో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన జగన్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.
ఇక టిడిపి, జనసేన పార్టీలు( TDP, Janasena parties ) కూడా ఇదేవిధంగా ఉమ్మడి కార్యాచరణ పై చర్చిన్చుకున్నారు.టిడిపి, జనసేన కలిసి తొలి జాబితా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ సంక్రాంతి పండుగ తర్వాత మేనిఫెస్టో, అభ్యర్థుల జాబితాపై ప్రకటన జారీ చేయనున్నారు.ఒంటరిగా ఎన్నికలకు వెళ్లినా, పొత్తులతో వెళ్లినా, తాము ఏపీలో బలమైన శక్తిగా ఎదగాలనే టార్గెట్ పెట్టుకున్నారు.
ఈనెల 22 నా అయోధ్యలో హడావుడి ముగిసిన తర్వాత రాజకీయంగా ఏపీ విషయంలో మోదీ కీలక నిర్ణయం తీసుకుంటారని ఏపీ బీజేపీ భావిస్తోంది.ఏపీలో 175 అసెంబ్లీ ,25 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు బిజెపి సిద్దం అవుతోంది.
ఇక కాంగ్రెస్ కూడా ఇదేవిధంగా వ్యూహరచన చేస్తోంది.వైసిపి, టిడిపిలోని అసంతృప్తి నేతలను తమ పార్టీలు చేర్చుకునే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఈనెల 17 నుంచి అభ్యర్థుల ఎంపిక మొదలుపెట్టనున్నట్లు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.ఈ విధంగా అన్ని పార్టీలు ఈ సంక్రాంతి తర్వాత నుంచి మరింత స్పీడ్ పెంచనున్నాయి.